Sudigali Sudheer : “జబర్దస్త్” షోతో ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సుడిగాలి సుధీర్. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత జబర్దస్త్ సహా పలు ప్రోగ్రామ్స్‌లో యాంకర్‌గా, ఆర్టిస్ట్‌గా బుల్లి తెరపై అదరగొట్టారు. పేరుకు తగ్గట్లే కెరీర్లో సుడిగాలిలా చెలరేగిపోతున్నారు. కంటెస్టెంట్‌గా మొదలైన తన జీవితం క్రమంగా జబర్దస్త్ టీమ్ లీడర్గ గా ఎదిగారు. ఆ షోలో సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ మధ్య ఉండే కెమిస్ట్రీకి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. బుల్లి తెరపై స్టార్ గా ఎదిగి అడపదడప వెండితెరపై రాణిస్తున్నారు. ఇటీవల వరుస సినిమాలో సిల్వర్ స్ర్కీన్ పై స్టార్‌గా ఎదగాలనుకుంటున్నారు.
Read Also:India-UAE Gold Trade: ఆ దేశం నుంచి లక్షల టన్నుల బంగారం.. చౌకగా దిగుమతి చేసుకోనున్న భారత్!?
సుధీర్ కి లైఫ్ ఇచ్చిన తిళ్లు వేణు రీసెంట్ గా “బలగం” తో డైరెక్టర్ గా పరిచయం అయ్యి ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. తన తో పాటుగా గెటప్ శ్రీను ని కూడా పరిచయం చేసిన వేణుతో కలిసి ఈ ముగ్గురూ చిన్న ట్రిప్ వేసుకున్న ఫోటోను వేణు షేర్ చేశారు. ఇక లేటెస్ట్ గా అయితే సుధీర్ కూడా ఓ బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేశాడు. అందులో ముగ్గురూ మంచులో ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుధీర్ ఈ బ్యూటిఫుల్ పిక్ తో మా మ్యాడ్ నెస్ ఎప్పటికీ మారదు అంటూ తెలిపాడు. అలాగే దీనితో పాటుగా ఓ వీడియో కూడా తాను పోస్ట్ చేసాడు. దీనితో ఇవి చూసి వీరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Bhola Shankar: ఐటమ్ సాంగ్‌కు అదిరిపోయే రేటు చెప్పిన శ్రియ
The madness that never changed @getupsrinu3 @VenuYeldandi9 pic.twitter.com/fEJv4xip3f
— Sudigali Sudheer (@sudheeranand) April 27, 2023