Bhola Shankar: ఇష్టం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే అగ్ర కథనాయికగా ఎదిగింది శ్రియ. దాదాపు 20ఏళ్ల కెరీర్లో పెళ్లయినా సేమ్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ మెరిసిపోతున్నారు. తక్కువ కాలంలోనే బడా హీరోల సరసన నాయికగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పలు భాషల్లో నటించి లెక్కకు మించిన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. పెళ్లయ ఓ బిడ్డకు తల్లయిన తర్వాత శ్రియ కెరీర్లో వేగం తగ్గింది. అడపాదడపా వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి తాజా చిత్రం భోళా శంకర్ లో శ్రియ స్పెషల్ సాంగ్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇందుకు చిత్ర బృందం శ్రియను సంప్రదించినట్టు, ఆమె చిరుతో చిందేయడానికి ఒప్పుకుందని టాక్. దాదాపు 20ఏళ్ల తర్వాత శ్రియ చిరుతో కాలుకదపనుందని అందరూ భావించారు. కానీ శ్రియ ఇక్కడే చిత్ర యూనిట్ కు మెలికపెట్టిందని తెలుస్తోంది. దాంతో యూనిట్ ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కాక విలవిలలాడుతోందంట.
Read Also: Dil Raju : ‘నా 25ఏళ్ల కెరీర్లో అతిపెద్ద లాస్ ఇది’
చిరంజీవితో స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసేందుకు ఏకంగా రూ.75 లక్షలు డిమాండ్ చేసిందట శ్రియ. ఇంత మొత్తానికి చాలామంది హీరోయిన్లు ఏకంగా సినిమాలు చేసేందుకు ఒప్పేసుకుంటున్నారు. అలాంటిది శ్రియ, ఒక్క సాంగ్ కోసం అంత మొత్తం డిమాండ్ చేయడంతో యూనిట్ కంగుతింది. యూనిట్ సభ్యలు శ్రియను ఎలాగోలా రూ.20-25 లక్షల్లో శ్రియను సెట్ చేయాలని అనుకున్నారట. కానీ ఒకేసారి 75 లక్షలు డిమాండ్ చేసేసరికి చిత్రబృందానికి చిన్నపాటి షాక్ తగిలినట్టైంది. నిజానికి, పూజాహెగ్డే, సమంత లాంటి వాళ్లు ఐటెంసాంగ్ చేసినప్పుడు భారీగా ఛార్జ్ చేస్తుంటారు. అంతగా క్రేజ్ లేని శ్రియ ఇంత డిమాండ్ చేస్తుందని యూనిట్ కలలో కూడా ఊహించలేదు.
Read Also: Passport: మైనర్లకు పాస్‌పోర్ట్ తప్పనిసరి.. దరఖాస్తు చేసే విధానం ఏమిటి?