Sudigali Sudheer: గాలోడు సినిమాతో హిట్ అందుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ సరసన బ్యాచిలర్ భామ దివ్య భారతి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ లో సుధీర్ హీరో ఎలివేషన్ వేరే లెవెల్ లో ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్యకాలంలో ట్విట్టర్ లో GOAT అని బాగా పాపులర్ అయిన విషయం తెల్సిందే. GOAT అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. తమకు నచ్చిన హీరోలు, సెలబ్రిటీలను ఫ్యాన్స్ గోట్ అని పిలుస్తారు. ఇక సుధీర్ కూడా గోట్ అని చెప్పుకుంటున్నాడు. అయితే ఇదే పేరుతో ఇప్పుడు విజయ్ సినిమా కూడా వస్తూ ఉండడంతో.. ఈ సినిమాపై కూడా హైప్ పెరిగిపోయింది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది. ఇక నేడు సంక్రాంతి పండుగ కావడంతో మేకర్స్.. కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు. పోస్టర్ ఆకట్టుకుంటుంది. దివ్య భారతి బట్టలు ఆరేస్తూ సీరియస్ లుక్ లో ఉండగా.. సుధీర్ ఆమె పక్కన నవ్వులు చిందిస్తూ కనిపించాడు. ఈ జంటను చూస్తుంటే.. విలేజ్ లో ప్రేమ కథలా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.