PM Mudra Loan: కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. అలాంటి పథకాలలో పీఎం ముద్ర లోన్ పథకం ఒకటి. బిజినెస్ మొదలు పెడదామనుకున్న వారికి చాలా డబ్బులు అవసరం. దానికోసం ప్రజలు బ్యాంకులను ఆశ్రయిస్తారు. కానీ కొన్నిసార్లు ఎక్కువ పత్రాల అవసరం కారణంగా ఇది కష్టం అవుతుంది. దేశంలో వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్రా యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మీరు ఎలాంటి హామీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. మీరు కూడా మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లోన్‌లో మీరు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, NBFCల నుండి కూడా ఈ రుణాన్ని పొందవచ్చు. ఈ రుణం వడ్డీ రేటు వివిధ బ్యాంకుల నుండి మారుతూ ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు ఈ రుణంపై 10 నుంచి 12 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తాయి.
Read Also:IND vs AUS: భారత బ్యాటర్ల విధ్వంసం.. కెమరూన్ గ్రీన్ ఖాతాలో చెత్త రికార్డు!
పీఎం ముద్రా రుణాలు మొత్తం మూడు రకాలు. మొదటి వర్గం శిశు రుణం. దీని కింద, మీరు మొదటి సారి మీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, ప్రభుత్వం మీకు ఎటువంటి హామీ లేకుండా 5 సంవత్సరాలకు రూ. 50,000 వరకు రుణం ఇస్తుంది. ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి రుణాలు కూడా ఇస్తారు. మీరు రూ. 50,000 నుండి రూ. 5 లక్షల వరకు రుణం తీసుకుంటే, అది కిషోర్ లోన్ కేటగిరీ కిందకు వస్తుంది. తరుణ్ లోన్ కేటగిరీ కింద, వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తుంది.
ఈ పథకంలో 24 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్ అప్లికేషన్ ద్వారా, మీకు ఆధార్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, అడ్రస్ ప్రూఫ్ మొదలైనవి అవసరం. ఈ పథకం కోసం దరఖాస్తు చేయడానికి, mudra.org.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఆపై ఫారమ్‌లో మొత్తం సమాచారాన్ని నమోదు చేసి, దానిని మీ సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంక్‌కు సమర్పించండి. అన్ని డాక్యుమెంట్‌లను పరిశీలించిన తర్వాత బ్యాంక్ మీ లోన్‌ను అప్రూవ్ చేస్తుంది.
Read Also:Plane In Mud: బురదలో కూరుకున్న విమానం.. తీయడానికి వచ్చిన జేసీబీలు.. సూపర్ ల్యాండిగ్ ఫైలట్ జీ