NTV Telugu Site icon

Supreme Court: రేపటిలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమర్పించండి.. ఎస్బీఐకి సుప్రీం ఆదేశాలు

Supreme Court

Supreme Court

Supreme Court: ఎన్నికల బాండ్లవివరాల వెల్లడికి ఎస్బీఐ అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత ఎన్నికల కమిషన్‌కు అన్ని ఎలక్టోరల్ బాండ్ లావాదేవీల వివరాలను అందించడానికి అదనపు సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు డేటాను సమర్పించాలని ఎస్‌బీఐని కోరింది. మార్చి 6లోగా వివరాలను వెల్లడించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎస్బీఐని కోర్టు మందలించింది. రేపటిలోగా సమాచారం అందించకపోతే ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకుపై ధిక్కార చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది.

Read Also: Purandeswari: ఏపీలో 1134 కి. మీ రోడ్లను వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని.. పాల్గొన్న పురంధేశ్వరి..

అలాగే ఆ సమాచారాన్ని మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా బహిర్గతపర్చాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్‌ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. అంతకుముందు, ఇప్పుడు రద్దు చేయబడిన స్కీమ్ వివరాలను అందించడానికి మరింత సమయం కావాలని ఎస్బీఐ చేసిన అభ్యర్థనను విన్న సుప్రీం కోర్టు.. కఠినమైన ప్రశ్నలను వేసింది. గత 26 రోజులుగా బ్యాంక్ ఏం చేసిందని ప్రశ్నించింది. 2017లో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాలు చేసిన పిటిషనర్లలో ఒకటైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) మరింత సమయం కావాలని ఎస్బీఐ చేసిన విజ్ఞప్తిని వ్యతిరేకించింది.

Read Also: Fitness : గోధుమపిండితో చేసిన చపాతీని రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

ఇటీవల ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు ఇవ్వడానికి జూన్ 30 వరకు సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును కోరింది. ఫిబ్రవరి 15న ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంలో, మార్చి 6లోగా ఎన్నికల కమిషన్‌కు జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని అందించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్చి 13లోగా సమాచారం అందించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. వెబ్‌సైట్‌లో పబ్లిష్‌ చేయండి. ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిన వారి సమాచారం అందించడానికి గడువును పొడిగించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌బీఐ సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎస్‌బీఐ తీరుపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. మార్చి 12 సాయంత్రం పనిగంటలు ముగిసేలోగా దాతల వివరాలను మీరు ఎన్నికల సంఘానికి అందజేయాల్సిందేనని ఎస్బీఐకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఆ వివరాలను వెబ్‌సైట్‌లో బహిర్గతపర్చాలని ఎన్నికల సంఘానికి సూచించింది.