Adivi Sesh: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా కెరీర్ ప్రస్తుతం అటు ఇటుగా ఉందని చెప్పాలి. చాలా రోజుల గ్యాప్ తరువాత వరుస సినిమాలతో బిజీఅయిన ఈ భామ ప్రస్తుతం శాకినీ డాకినీ చిత్రంలో నటిస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ డ్రామాకు ఈ సినిమా అధికారిక రీమేక్. రెజీనా తో పాటు నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గతరాత్రి గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. అడివి శేష్, డైరెక్టర్ నందినీ రెడ్డి ముఖ్య అతిధులుగా విచ్చేశారు.
ఇక స్టేజి మీద అడివి శేష్.. శాకినీ డాకినీ లతో ఆడుకున్నాడు. నివేదా, రెజీనాలను తనదైన ప్రశ్నలతో తికమక పెట్టేశాడు. నాని, సుధీర్ బాబు, తారక్ తో నటించావ్.. నాతో ఎందుకు నటించలేదు అని నివేదా ను అడుగగా.. మీ డేట్స్ దొరకలేదు అని నివేదా స్మార్ట్ ఆన్సర్ ఇచ్చి తప్పించుకొంది. ఇక రెజీనా ను తన కాంట్రవర్సియల్ ప్రశ్నను అడిగి షాక్ ఇచ్చాడు. “ఏంటి ఈ మధ్య ఏదో అన్నావ్.. అబ్బాయిలు.. 2 మినిట్స్ మ్యాగీ అని.. ఏంటి సంగతి, నాకు చెప్పు.. చాలామంది నాకు స్టామినా ఎక్కవ అని చెప్పారు” అని అడిగేశాడు. దానికి రెజీనా నవ్వుతూ 2 మినిట్స్ లో చెప్తా అంటూ మాట దాటేసింది. ఇక తాను జోక్ గా అడిగినట్లు చెప్పుకొచ్చిన శేష్.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇక రెజీనా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. అబ్బాయిలు, మ్యాగీ ఒకటే.. 2 మినిట్స్ లో ఐపోతుంది అని ఘాటు వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.