Holidays: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటన ప్రకారం.. అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని తీర జిల్లాలు సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
Telangana : విద్యార్థుల కోసం నిజంగా ఇది పండుగల వారం! ఇప్పటికే శనివారం (రెండో శనివారం) , ఆదివారం సెలవులతో సరదాగా గడుపుతున్న పిల్లలకు మరో శుభవార్త వెల్లడైంది. సోమవారం (ఏప్రిల్ 14) కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీనితో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల విశ్రాంతి లభించబోతోంది. ఈ సెలవు ప్రత్యేకత ఏంటంటే… ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కేంద్ర…