Student Death: సీఎంతో మాట్లాడిన విద్యార్థిని ఆత్మహత్య.. రంపచోడవరంలో కలకలం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం జిల్లాలోని రంపచోడవరం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరివేసుకుని మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇటీవల నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో నేరుగా మాట్లాడిన విద్యార్థిని మృతురాలు కావడంతో.. ఈ ఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
రంపచోడవరం మండలం ఇర్లపల్లి కొత్త కాలనీకి చెందిన ముర్రం శివాని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం ఇంటి సమీపంలోని రేకుల షెడ్లో ఉరివేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను విచారిస్తూ విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Also Read
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
ఈ నెల 24న రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ కార్యక్రమంలో సీఎం పక్కనే కూర్చొని మాట్లాడిన విద్యార్థినే ఈ ముర్రం శివాని. సీఎంతో ఎంతో చక్కగా మాట్లాడిన శివాని.. రెండు రోజుల వ్యవధిలో మృతి చెందడం స్థానిక ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. శివాని మృతికి గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి.
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!