Identical Twins: కవలల వింత కోరిక.. ఒకేసారి ఒక్కరితోనే గర్భం దాలుస్తారట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Identical Twins: ఆస్ట్రేలియాలోని ప్రపంచంలోనే అత్యంత సమరూప కవలలు తమ వింత కోరికను బయటపెట్టారు. అన్ని పనులు కలిసి చేసే వీరు.. ఇప్పుడు ఒకేసారి ఒకే బాయ్‌ఫ్రెండ్‌తో ఆ అనుభూతిని పొందాలనుకుంటున్నారు. తమ బాయ్‌ఫ్రెండ్‌ను ప్రస్తావిస్తూ ఈ కోరికను వెల్లడించారు. పెర్త్ నివాసితులైన కవలలు అన్నా, లూసీ డెసింక్‌లు ఇద్దరూ బాయ్‌ఫ్రెండ్ మార్ బెన్ బైర్న్‌తో తమ గర్భాలను పొందాలని ప్రయత్నిస్తున్నామనే సంభాషణ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియాకు చెందిన కవలా అక్కచెళ్లెల్లు అన్ని పనులు కలిసే చేస్తారు. అది తినడమైనా, పడుకోవడమైనా. వారిద్దరికీ బాయ్‌ఫ్రెండ్ కూడా ఒకరే. ఇప్పుడు ఆ కవలలు తమ జీవితాలను మరో అడుగు ముందుకు వెద్దామనుకుంటున్నారు. ఒకేసారు గర్భం దాల్చాలని ఫిక్సయ్యారు. 37 ఏళ్ల వయస్సు గల ఈ కవలలు తిండి, గుడ్డతో పాటు అన్ని ఒకేలా ఉండేడట్టు చూసుకుంటారు. బాత్‌రూంకు కూడా కలిసే వెళ్తారు. ప్రస్తుతం వీరిద్దరు తమ బాయ్‌ఫ్రెండ్ బెన్ బైర్న్‌తో కలిసి జీవిస్తున్నారు. ఇంతకు ముందు డేటింగ్ చేసిన అబ్బాయిలందరూ తమను విడదీయడానికి ప్రయత్నించారని.. బెన్ మాత్రం అందరికన్నా భిన్నమని ఈ అక్కాచెళ్లెల్లు చెప్పారు. బెన్ వద్ద తమకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. అందుకే బెన్‌తో ఒకే మంచాన్ని పంచుకుంటున్నామని పేర్కొన్నారు.
Also Read
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
Mother Tearful: ఆకలి వేస్తున్న అన్నం పెట్టడం లేదు.. కన్నీరు పెట్టుకున్న తల్లి
ఓ టీవీ షోలో పాల్గొన్న ఈ కవలలు తమ వింత కోరికను బయటపెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఇప్పటివరకు అన్ని కలిసే చేసిన తాము.. గర్భం కూడా ఒకేసారి దాల్చాలనుకుంటున్నట్టు ప్రకటించారు. ఐవీఎఫ్ పద్ధతిలో ఇది సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ప్రెగ్నెన్సీ మాత్రం ఇద్దరికీ ఒక్కరితోనే ఒకే సమయంలో రావాలని కోరుకుంటున్నట్లు తేల్చిచెప్పారు. ఇది ఇతరులకు విడ్డూరంగా అనిపించినా.. తాము మాత్రం తమకు ఇష్టమున్నట్టు జీవించడానికి నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది లూసీ. తమ మధ్య సోదరి బంధం బలంగా ఉందని చెప్పింది. మరి వీరిద్దరిలో ఒకరు మగబిడ్డకు, మరొకరు ఆడబిడ్డకు జన్మనిస్తే పరిస్థితి ఏంటని టీవీ షో వ్యాఖ్యాత ప్రశ్నించగా.. ‘మాకు ఫర్వాలేదు. బిడ్డలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నంత వరకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని సమాధానమిచ్చారు.
తాజావార్తలు
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!