NTV Telugu Site icon

Hyderabad : ట్రాఫిక్ నియమాన్ని పాటించిన వీధి కుక్క… వీడియో వైరల్

Hyd Police

Hyd Police

మనుషులు కూడా అప్పుడప్పుడు జంతువుల తెలివితేటలను కళ్లకు కట్టినట్లు చూస్తారు. అవి చేసే పనులకు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇక కొన్ని జంతువులు అయితే ఊహకందని విధంగా తెలివితేటలకు ప్రదర్శిస్తాయి. కొన్ని జంతువులు ప్రమాదాలను ముందే గుర్తిస్తాయి. పైగా జంతువుల్లోని కమ్యూనికేషన్ ను చూస్తే తెగ ముచ్చటేస్తుంది. అయితే ఇలాంటి తెలివిగల అరుదైన జంతువులు చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ తెలివైనా జంతువు హైదరాబాద్‌లో కనిపించింది. అదే వీధి కుక్క. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వీధి కుక్క తెలివిని ఎలా ప్రదర్శించిందని మీకు అనుమానం వచ్చే ఉంటుంది. కొందరి మనుషులకంటే ఆ కుక్క చాలా బెటర్ అనే విధంగా మన్ననలు పొందింది.

READ MORE: Jyoti Malhotra: ‘‘గూఢచారి’’ జ్యోతి మల్హోత్రాకు స్పాన్సర్ చేసి పాక్ ట్రావెల్ సంస్థ

ఇది చేసిన పనిని హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు సైతం మెచ్చుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ వీడియోలో.. ఓ కుక్క ట్రాఫిక్‌ నియమాన్ని తనకు ఇంతకు ముందు తెలిసినట్టుగానే పాటించింది. సిగ్నల్‌ను పడిన వెంటనే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఆ మూగ జీవి జీబ్రా క్రాసింగ్ పై నుంచి రోడ్డు క్రాస్ చేసింది. మళ్లీ రోడ్డు అవతలి వైపునకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ.. సిగ్నల్ పడి వాహనాలు నిలిచే వరకు వేచి ఉంది. సిగ్నల్ పడిన వెంటనే వాహనాలు నిలిచిపోవడంతో ఆ శునకం మళ్లీ జీబ్రా క్రాసింగ్ మీద నుంచి రోడ్డు దాటింది. ఇలా మూడు సార్లు ట్రాఫిక్ నియమాన్ని పాటిస్తూ.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల మన్ననలు పొందింది. ఈ వీడియోను షేర్ చేసిన ట్రాఫిక్ పోలీసులు.. “కొన్నిసార్లు, అతి చిన్న జీవులు మనకు అతిపెద్ద పాఠాలను నేర్పుతాయి.” అని రాసుకొచ్చారు. ఈ కుక్క చేసిన పనికి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలో మూగ జంతువుకు తెలిస్తే.. మనుషులకు ఎందుకు అర్థం కావడం లేదంటూ చాలా మంది కామెంట్ చేశారు.

READ MORE: Cuteness Overload: పార్లమెంట్‌లో బాలనేతలు భలే బాగున్నారుగా..!