Cuteness Overload: నేటి ఆధునిక సాంకేతికతలో అసాధ్యం అంటూ ఏదీ లేదు. మరీ ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI – Artificial Intelligence) రాకతో అయితే, ఏదైనా సాధ్యమే అన్నట్లుగా మారింది. వైద్యం, విద్య, వ్యాపారం సహా అన్ని రంగాల్లోనూ ఈ సాంకేతికత విస్తరించింది. AI సాయంతో అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసిన ఎన్నో వీడియోలను మీరు చూసి ఉంటారు. అయితే, ఇప్పుడు AI చేతిచలకింతో మరో అద్భుతమైన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారత రాజకీయ ప్రముఖులు పిల్లలుగా పార్లమెంట్ లో కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Viral: బైక్‌పై చెప్పుల పండుగ.. నెట్టింట్లో ‘భార్య ప్రతాపం’ వీడియో వైరల్..!
@theprataftiwari అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ AI వీడియోను షేర్ చేశారు. “మన దేశ రాజకీయ నాయకులు పిల్లలుగా పార్లమెంట్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది?” అనే ఆలోచనతో ఈ వీడియోను రూపొందించారు. వీడియో ప్రారంభంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభ సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఎంపీ మహువా మొయిత్రా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బారామతి ఎంపీ సుప్రియా సూలే, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఓవైసీ.. ఇలా పలువురు అగ్రశ్రేణి నాయకులు బుజ్జి బుజ్జి పిల్లలుగా, అచ్చం పెద్దల మాదిరిగానే పార్లమెంట్ లో కూర్చుని, మాట్లాడుతున్నట్లుగా ఈ వీడియోలో చూపించారు.
Uber Titanic : బెంగళూరు రోడ్లపై టైటానిక్ నౌక.. ఉబర్ కొత్త ప్రయోగం..!
మే 21న షేర్ చేయబడిన ఈ వీడియో ఇప్పటికే రెండు లక్షలకు పైగా వీక్షణలను సాధించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు తమ స్పందనలను పంచుకుంటున్నారు. ఒక యూజర్, “ఈ వీడియో చాలా బాగుంది” అని కామెంట్ చేయగా, మరొకరు “ఈ వీడియోలో ఏ రాజకీయ నాయకుడు అత్యంత ముద్దుగా ఉన్నాడు?” అని ప్రశ్నించారు. ఇంకొందరు, “రాహుల్ గాంధీ చాలా ముద్దుగా ఉన్నారు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వీడియో AI సాంకేతికత ఎంత దూరం వచ్చిందో, ఎంత సృజనాత్మకంగా ఉపయోగించుకోవచ్చో మరోసారి నిరూపించింది. అంతేకాదు, ప్రజలకు వినోదాన్ని అందిస్తూనే, రాజకీయ నాయకులను ఒక విభిన్న కోణంలో చూసే అవకాశాన్ని కల్పించింది.
Pretty little baby ft indian politicians pic.twitter.com/caHpPQk3rk
— Prayag (@theprayagtiwari) May 21, 2025