Hyper Aadi: వారంతా ఒక్కటే.. అల్లు అర్జున్‌ను ట్రోల్ చేయడం ఆపండి!
- వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ క్యాంపెనింగ్
- ఫ్రెండ్ కోసమే వచ్చానని చెప్పినా ట్రోల్స్ ఆగలేదు
- ట్రోల్ చేయడం ఆపండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyper Aadi React on Allu Arjun Trolls: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ క్యాంపెనింగ్ చేయడం పెద్ద చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. మామ పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేయకుండా.. తన ఫ్రెండ్‌కు ప్రచారం చేయడంతో మెగా ఫ్యాన్స్ ఫీలయిపోయారు. పార్టీ తరుపున ప్రచారం చేయలేదని, తన ఫ్రెండ్ కోసమే వచ్చానని బన్నీ చెప్పినా.. ట్రోల్స్ ఆగలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి బన్నీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ ట్రోల్స్‌పై తాజాగా కమెడియన్ హైపర్ ఆది స్పందించారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అని, అల్లు అర్జున్‌ను ట్రోల్ చేయడం ఆపండని కోరారు.
అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా నటించిన చిత్రం ‘శివం భజే’. ఆగస్టు 1న ఈ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో నేడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు హాజరైన హైపర్ ఆది.. అల్లు అర్జున్ గురించి మాట్లాడారు. ‘అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నర్. ఆయనను అందరూ గౌరవించాలి. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే. కొంతమంది అల్లు అర్జున్‌ను కావాలనే ట్రోల్ చేస్తున్నారు. పెద్ద పెద్ద థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. దయచేసి అలా చేయొద్దు. అల్లు అర్జున్‌ను ట్రోల్ చేయడం ఆపేయాలని కోరుతున్నా’ అని ఆది అన్నారు.
Also Read
Also Read: Rahul Dravid Coach: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
‘పవన్ కల్యాణ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన సంతోషంగా ఉంటే దూరం నుంచి చూసి ఆనందిస్తా. బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసుకుంటా. పవన్ కోసమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా. నాకు ఎమ్మెల్సీ ఇస్తారంటూ జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదు’ అని హైపర్ ఆది చెప్పారు. జబర్దస్త్ షోతో హైపర్ ఆది పాపులర్ అయిన విషయం తెలిసిందే. కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగులతో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!