ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభిస్తున్న వందేభారత్ రైళ్లపై వరుస దాడులు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడో ఒక చోటు రాళ్లతో ఈ రైళ్ళ మీద ఆగంతకులు దాడులు చేస్తున్నే ఉన్నారు. ట్రైన్స్ పై దాడులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని.. జైలు శిక్ష అనుభవించాలని రైల్వే అధికారులు హెచ్చరించిన కూడా.. వాటిని పట్టించుకోకుండా.. మరీ రైలుపై దాడులకు దిగుతున్నారు.
Also Read : Pawan Kalyan: OG అయిపొయింది… ఇక వీరమల్లడుగా మారనున్నాడు
భారత్ లో సెమీ హైస్పీడ్ రైళ్లుగా పేరున్న వందే భారత్ రైళ్లపై దాడుల పరంపరకు చెక్ పెట్టడం ఎలా అని రైల్వేశాఖ ఆలోచనలో పడింది. అయితే, తాజాగా కేరళలో కొత్తగా ప్రారంభమైన వందేభారత్ పైనా రాళ్ల దాడి జరిగింది. ఏప్రిల్ 25వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి.. తిరువనంతపురం నుంచి కాసర్ గోడ్ మధ్య కేరళలో తొలి వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించారు. తాజాగా తిరునవయా-తిరూర్ మధ్య వందే భారత్ పై ఆగంతకులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో అద్దం పగిలిపోగా.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపటినట్లు వెల్లడించారు.
Also Read : Today Business Headlines 02-05-23: గూగుల్‌కి.. ‘గాడ్‌ఫాదర్’ గుడ్‌బై. మరిన్ని వార్తలు
ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంతేందుకు సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్ లో వందే భారత్ పై మూడుసార్లు రాళ్ల దాడి జరిగింది. అంతకు ముందు మార్చ్ లో పశ్చిమ బెంగాల్ ఫన్సిదేవా వద్ద.. అదే నెలలో హౌరా-న్యూ జల్పైగురి మధ్య మాల్దా సమీపంలో వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. మొత్తంగా దేశంలో వందే భారత్ రైళ్లు పట్టాలెక్కిన తర్వాత.. ఇలాంటి ఘటనలు 25 వరకు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో రైల్వే శాఖ సీఆర్పీఎఫ్ ద్వారా ఈ తరహా నేరాల కట్టడికి ఆలోచనలు చేస్తోంది.