Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Rally: భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గుచూపడం, అమెరికా మార్కెట్లలో ర్యాలీ వంటి పరిణామాలు దేశీయ మార్కెట్లకు ఊతమిచ్చాయి. దీంతో మార్కెట్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.8 లక్షల కోట్లు పెరిగింది. నేడు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 1,300 పాయింట్లకు పైగా లాభంతో 78,630 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 50 కూడా 24,350 మార్కును దాటింది. ఈ ర్యాలీతో భారత మార్కెట్లు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాలను నమోదు చేశాయి. మధ్యాహ్నం 1:45 గంటల సమయానికి సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా పెరిగి 79,330 వద్దకు చేరింది. నిఫ్టీ 581 పాయింట్లు లాభపడి 24,548.55 వద్ద ట్రేడయింది. సెప్టెంబర్ 4, 2026 తర్వాత తొలిసారిగా నిఫ్టీ 24,000 మార్కును దటిది.
గురువారం మార్కెట్ ప్రారంభ సమయంలో బీఎస్ఈలోని అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,93,44,359 కోట్లుగా ఉంది. మధ్యాహ్నం 1:45 గంటల సమయానికి ఇది రూ.5,02,36,269 కోట్లకు చేరుకుంది. అంటే కొన్ని గంటల్లోనే దాదాపు రూ.8 లక్షల కోట్ల సంపద పెరిగింది. అంతకుముందు రోజు అమెరికా మార్కెట్లలో ఎస్ అండ్ పీ 500 సూచీ మూడు నెలల గరిష్ఠ స్థాయిని తాకడం కూడా భారత మార్కెట్లలో ఉత్సాహాన్ని పెంచింది.
Also Read
- Meta Layoffs: టెక్ ఉద్యోగులకు మరో షాక్.. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ప్రకటన..
- Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
- IRDAI New Motor Insurance Rules: కారు, బైక్ ఉన్నవారికి అలర్ట్.. డిసెంబర్ 15 నుంచి మోటార్ ఇన్సూరెన్స్‌లో కొత్త రూల్స్!
- Anil Ambani Group: అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ భారీ చర్యలు.. రూ.510 కోట్ల ఆస్తులు అటాచ్, చార్టర్డ్ విమానాలు స్వాధీనం
ముడి చమురు ధరలు
గురువారం మార్కెట్ల ర్యాలీకి ప్రధాన కారణం ముడి చమురు ధరలు భారీగా తగ్గడమే. అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ ధర 8.7% పడిపోయి బ్యారెల్‌కు 94 డాలర్ల సమీపానికి చేరింది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర కూడా 88 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయం తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరగవచ్చని పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు. భారత్ తన ముడి చమురు అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే దేశ దిగుమతి బిల్లు పెరగడంతో పాటు రూపాయి విలువపై ఒత్తిడి, ద్రవ్యోల్బణం ముప్పు ఏర్పడతాయి. అదే చమురు ధరలు తగ్గితే దిగుమతి వ్యయం తగ్గి, కంపెనీల లాభదాయకత మెరుగుపడే అవకాశం ఉంటుంది.
మళ్లీ విదేశీ పెట్టుబడులు
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) కూడా భారత మార్కెట్లలో కొనుగోళ్లు పెంచారు. బుధవారం ఒక్కరోజే రూ.7,284 కోట్ల విలువైన భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. అక్టోబర్ 28, 2025 తర్వాత ఒకే రోజులో వారు చేసిన అత్యధిక కొనుగోళ్లు ఇవే. ఇది వరుసగా నాలుగో సెషన్లోనూ విదేశీ పెట్టుబడిదారులు నికర కొనుగోళ్లు చేయడం. నవంబర్‌లో ఇప్పటివరకు రూ.17,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దాదాపు రూ.90,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన తర్వాత మళ్లీ కొనుగోళ్లకు మొగ్గుచూపడం మార్కెట్‌కు సానుకూల సంకేతంగా మారింది.
అమెరికా మార్కెట్ల ర్యాలీ
అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలను నమోదు చేశాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 1.6 శాతం పెరగగా, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ దాదాపు 3 శాతం లాభపడింది. నాస్డాక్ కాంపోజిట్ కూడా 1.4 శాతం పెరిగింది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధించడంతో రాజకీయ అనిశ్చితి తగ్గవచ్చన్న అంచనాలు పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గే అవకాశం, చమురు ధరల పతనం, పెట్టుబడిదారుల్లో పెరిగిన రిస్క్ తీసుకునే ధోరణి ప్రపంచ మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి!
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Meta Layoffs: టెక్ ఉద్యోగులకు మరో షాక్.. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ప్రకటన..
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
CM Revanth Reddy: “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి”.. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న కార్యక్రమం..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!