NTV Telugu Site icon

Double ISMART : “స్టెప్ప మార్ ” తో అదరగొట్టిన ఇస్మార్ట్ శంకర్..

Double Ismart

Double Ismart

Double ISMART : ” ఇస్మార్ట్ శంకర్ ” సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరోసారి కలిసి ” డబుల్ ఇస్మార్ట్ ” (Double ISMART) తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 15, 2024 న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా మూవీ మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలు పెట్టేసారు.

Maheshwar Reddy : కార్పొరేట్ హాస్పిటల్స్‌ను సీఎం రేవంత్‌ ప్రోత్సహిస్తున్నాడు

ఇదివరకు సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ” స్టెప్ప మార్ ” ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సోమవారం నాడు తెలుగుతో పాటుగా, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా పాటను రిలీజ్ చేశారు. ఈ పాట పూర్తిగా మాస్ లిరిక్స్ తోపాటు., మాస్ డాన్స్ మ్యుమెంట్స్ తో పాట ఆకట్టుకుంది. ఈ పాటకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మాస్ బీట్స్ అందించారు. ప్రస్తుతం ఈ పాట ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాను పూరి జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి కౌర్లు కలిసి నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తరహాలో ఈ చిత్రం కూడా మరో మాస్ బ్లాక్ బస్టర్ హిట్ ను సాధిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

Kadapa: కాజిపేటలోని జడ్పీ హైస్కూలులో విద్యార్థినుల అస్వస్థత..ఆసుపత్రిలో చేరిన10మంది

Show comments