Sriya Reddy : పవన్ కల్యాణ్ అంత పెద్ద స్టార్ అని నాకు తెలియదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రియా రెడ్డి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రీసెంట్ గా ఈ భామ ‘సలార్’ మూవీతో సాలిడ్ హిట్ అందుకుంది.సుమారు దశాబ్దం తర్వాత మళ్లీ వెండితెరపై అడుగు పెట్టిన శ్రీయా రెడ్డి సలార్ చిత్రంలో పోషించిన రాధా రమా పాత్ర ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. పృథ్విరాజ్ సోదరిగా ఒదిగిపోయి నటించింది. ఆమె నటకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా ‘సలార్’ మూవీతో పాటు తన తదుపరి చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.‘సలార్’ మూవీ తన కెరీర్ కు మాంచి బూస్టింగ్ ఇచ్చిందని శ్రియా రెడ్డి వెల్లడించింది. సుమారు దశాబ్దం తర్వాత చేసిన ఈ సినిమా తనకు మర్చిపోలేని గుర్తింపు తెచ్చిందని చెప్పింది. ఇక తన తర్వాతి చిత్రం ‘ఓజీ’ గురించి ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తన పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని చెప్పింది. ఈ ప్రాజెక్టులో భాగం అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించింది. “‘ఓజీ’ అద్భుతమైన చిత్రం. దర్శకుడు సుజీత్ డిఫరెంట్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.పవన్ కల్యాణ్ గురించి నేను ఈ సినిమాలో నటించే వరకు పెద్దగా వినలేదు. ఆయన అంత పెద్ద స్టార్ అని కూడా తెలియదు. ‘ఓజీ’లో నటిస్తున్నాని తెలియడంతో ఎక్కడికి వెళ్లినా కూడా పవన్ కల్యాణ్ అభిమానులు నన్ను చాలా గొప్పగా చూస్తున్నారు. మీరు మా హీరోతో నటిస్తున్నారు కదా.. అని అడుగుతున్నారు. ఆయనకు ప్రేక్షకులలో ఉన్న ఫాలోయింగ్ నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.. సెట్ లో ఎప్పుడు కలిసినా చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన చాలా మంచి మనిషి. పవర్ స్టార్ తో కలిసి పని చేయడం ఎంతో హ్యాపీగా అనిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగం కావడం గొప్పగా ఉంది. ఈ సినిమాలో నాది నెగెటివ్ రోల్. కానీ, నా క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయి. ‘ఓజి’సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను. ప్రేక్షకులతో కలిసి తొలి రోజు సినిమా చూడాలి అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
- Tags
- #OG
- pawan kalyan
- Sriya Reddy
తాజావార్తలు
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..