Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Srividya Student At Kakatiya University Passed Away After Battling For Her Life For Four Days

Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

Published Date :March 17, 2026 , 9:59 pm
By Venkatesh
  • కాలేజీలో సీనియర్ల వేధింపులు
  • మనస్థాపంతో యువతి ఆత్మహత్యాయత్నం
  • 4 రోజులపాటు మృత్యువుతో పోరాడి చనిపోయిన కాకతీయ యూనివర్శిటీ విద్యార్థిని
Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. మనస్థాపంతో యువతి ఆత్మహత్యాయత్నం.. 4 రోజులపాటు మృత్యువుతో పోరాడి చనిపోయిన కాకతీయ యూనివర్శిటీ విద్యార్థిని… మృతికి అరగంట ముందు ఇచ్చిన మరణ వాంగ్మూలతో పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు శ్రీవిద్య ఎందుకు ఆత్మహత్యా యత్నం చేసింది? ఆమె మృతికి కారణాలేంటి? యువతి పేరు శ్రీవిద్య. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకి చెందిన అంజమ్మ కూతురు. కాకాతీయ యూనివర్సిటీలో ఎంఎస్‌సీ.. ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీలో సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. అక్కడే యూనివర్సిటీలోని పద్మాక్షి హాస్టల్‌ బీ బ్లాక్‌లో ఉంటోంది.

Also Read:Perfect Roti Dough Ratio: రొట్టె పిండిని ఎలా కలపాలి.. ఎంత నీరు వాడాలి.. ? 99 శాతం మందికి తెలియని విషయం ఇది..!

అదే యూనివర్సిటీకి చెందిన పలువురు సీనియర్‌ విద్యార్థినిలతో మార్చి 5న శ్రీ విద్యకు వివాదం నెలకొంది. తమ వస్తువులు కొన్ని కనిపించకుండా పోయాయని.. అవి శ్రీవిద్యే తీసిందని ఆమెతో గొడవకు దిగారు సీనియర్లు. కానీ శ్రీవిద్య మాత్రం తాను అలాంటిది ఎక్కడా చేయలేదని.. ఎవరి వస్తువులు తీసుకెళ్లలేదని వారికి తేల్చి చెప్పింది. కానీ వాళ్లు పట్టించుకోకుండా పోలీసులకు చెబుతామని యూనివర్సిటీ క్యాంపస్‌లో స్టూడెంట్స్ అందరి ముందు ఆమెను బెదిరించారు. తమ వస్తువులు శ్రీవిద్యే దొంగతనం చేసిందని ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారు. కానీ శ్రీవిద్య ఒప్పుకోకపోవడంతో.. మూడు రోజుల పాటు హాస్టల్లోని ఓ గదిలో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో శ్రీ విద్య తన తల్లికి ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది.

వారు వచ్చి కాలేజీ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడి నుండి అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ.. అప్పటికే తీవ్ర మనస్థాపంతో ఉన్న శ్రీవిద్య ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. శ్రీవిద్యకు వాంతులు కావడంతో ఆమె కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఐతే అక్కడ వైద్యులకు కానీ.. కుటుంబసభ్యులకు కానీ.. తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పలేదు. దీంతో ఆమె పరిస్థితి సీరియస్‌గా మారింది. దీంతో వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు చెప్పడంతో నిమ్స్‌కు తరలించారు కుటుంబసభ్యులు.

కానీ నిమ్స్‌లోనూ ఆమె పరిస్థితి విషమంగానే మారింది. నాలుగు రోజులు మృత్యువుతో పోరాటం చేసి ఓడిపోయింది శ్రీవిద్య. చివరికి ప్రాణాలు విడిచింది. కాకతీయ యూనివర్సిటీకి చెందిన సీనియర్‌ విద్యార్థుల్లో ఆరుగురు విద్యార్థినులు తీవ్రంగా వేధింపులకు గురి చేయడంతోనే ఆత్మహత్యా యత్నం చేసిందని శ్రీవిద్య తల్లి అంజమ్మ అంటోంది. తన కూతురును ఛాతీ కింద రబ్బర్‌ బ్యాండ్లతో కొట్టిన దెబ్బలు, భుజం లేవకుండా కొట్టిన గాయాలు ఉన్నాయని.. మూడు రోజుల పాటు తన కూతురును గదిలో వేసి కొట్టారని అంజమ్మ చెబుతోంది.

Also Read:Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

మరోవైపు శ్రీవిద్య చనిపోయే కంటే అరగంట ముందుగా ఆమె మరణ వాంగ్మూలం రికార్డ్ చేశారు. ఆ వీడియోలో తనను సీనియర్లు వేధించిన తీరును వివరించింది శ్రీవిద్య. పలువురు సీనియర్ల పేర్లను వెల్లడించింది. నిమ్స్‌‌లో ప్రాణాలు వదిలిన శ్రీ విద్య… డెడ్‌బాడీకి గాంధీలో పోస్టుమార్టం పూర్తయిన తరువాత కుటుంబసభ్యులకు అప్పగించారు. శ్రీ విద్య డెడ్‌బాడీని తీసుకొని, అంత్య క్రియల కోసం స్వగ్రామానికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kakatiya University
  • khammam
  • Srividya
  • student
  • telangana

తాజావార్తలు

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

  • Tragedy : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి..!

  • Saggubiyyam Payasam: పంచదార అక్కర్లేదు.. ఎండలకి చలవ చేసే ‘హెల్దీ’ పాయసం ఇలా సింపుల్‌గా చేసుకోండి!

  • HAWALA MONEY: కారంపొడి చల్లి.. కత్తులతో బెదిరించి.. రూ. కోటితో జంప్

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions