ఈ నెల 9న మహబూబ్ నగర్ లోని శిల్పారామంలో TASK నేతృత్వంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మహబూబ్ నగర్ లోని I.T టవర్ లో ఉన్న కంపెనీలకు ఐటీ ఉద్యోగుల కోసం ఈ జాబ్ మేళా. లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామని, పాలమూరు.. మట్టి మోసే లేబర్ నుంచి నేడు ఐటీ ఉద్యోగుల దాకా వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది మరిచిపోలేని రోజని, మన పిల్లలు ఇక్కడే చదివి.. ఇక్కడే ఉద్యోగం చేసే అవకాశం మా ప్రభుత్వం కల్పించిందని, పది కంపెనీల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయని ఆయన అన్నారు. మొదటి దశలో 650 ఉద్యోగాలు ఇస్తారు. ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే.. ఉన్న చోటనే ఉద్యోగం రావడం అదృష్టమని, ఇది ప్రారంభం మాత్రమేనన్నారు.
Also Read : 2000Note: షాకింగ్ న్యూస్.. 21 లక్షల కట్టల 2000 నోట్లు ఎక్కడ?
త్వరలోనే అమర్ రాజా కంపెనీ కూడా ప్రారంభం అవుతుంది. హన్వాడ లో ఫుడ్ పార్కు వస్తుందని, గతంలోని పాలకులు టైమ్ పాస్ చేశారు. చేసింది శూన్యమన్నారు శ్రీనివాస్ గౌడ్. ఇప్పుడు మెట్రో రైలు షాద్ నగర్ వరకు వస్తుందని, భవిష్యత్ లో మహబూబ్ నగర్ ఐటీ టవర్ వరకు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ త్వరలోనే కార్పొరేషన్ అవుతుందని, ఐటీ టవర్ నుంచి బై పాస్ కు వంద ఫీట్ల రోడ్ కూడా వస్తుందని ఆయన కోరారు. ఇట్లా ఇక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు గంట లోపే వెళ్ళే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, భవిష్యత్ మహబూబ్ నగర్ అనేది చాలా అద్భుతంగా వుంటుందన్నారు. అందుకు ..అందరూ సహకరించాలని, ఇది మన నగరం.. మన పిల్లల భవిష్యత్ కోసం ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఇలాంటి ప్రశాంత వాతావరణం ఎవరూ పాడు చేయవద్దు. అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని బహిష్కరిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
Also Read : Australia: కామాంధుడు.. 91 మంది బాలికలపై అత్యాచారం..1600లైగింక వేధింపుల కేసులు