Srikakulam Farmers Problem: అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకృతి ప్రకోపానికి సిక్కోలు రైతులు కుదేలవుతున్నారు. అతివృష్టి లేకపోతే అనావృష్టి సంభవిస్తూ ప్రతిఏటా ఇబ్బందులు గురౌతున్నారు. వరుస తుఫాన్లు పంటలను తుడిచిపెట్టుకుపోతే సకాలంలో వర్షాలు లేఖ నారు మడులు ఎండిపోతున్నాయి. అధికారుల అలసత్వంతో ప్రతి ఏటా తోటపల్లి రైతులు అవస్దలుపడుతున్నారు.
రాష్ట్రంలో వ్యవసాయాధారిత జిల్లాలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. ఈ జిల్లాలో సుమారు 2,39,702 హెక్టార్ల సాగు భూమి ఉంది. ఈ మెత్తం సాగుభూమిలో ఖరీఫ్, రబి రెండు పంటలు పండిస్తున్నప్టటికీ ఖరీఫ్ లో ఎక్కువ శాతం వరి పండిస్తారు. జిల్లా మొత్తం మీద సుమారు 2 లక్షల హెక్టార్లలో వరి పంటను పండిస్తున్నారు. జిల్లాలో వ్యవసాయం అంతా ఎక్కువగా వంశధార,నాగావళి నదులపై ఉన్న ఆనకట్టలపై ఆధారపడి ఉంటుంది.
Also Read
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
కొన్ని మండలాలు మాత్రం వర్షాధారంపై ఆధారపడి ఉన్నాయి. వీటిలో రణస్థలం, లావేరు, సారవకోట, పోలాకి, ఎచ్చెర్లలో కొంతభాగం వర్షాధారం మీద ఆధారపడిన మండలాలు ఉన్నాయి. తోటపల్లి ప్రోజెక్ట్ పై ఆధారపడి ప్రతి ఏటా పంటలు వేయటం అధికారుల నిర్లక్ష్యంతో పాలకొండ , వీరఘట్టాం , రేగిడి మండలాలల్లో సాగునీరు అందటంలేదు.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మెదట్లో వర్షాలు కురవడంతో రైతాంగమంతా వరి సాగుకు పూనుకున్నారు. గతంలో మాదిరి వరినాట్లు వేయకుండా ఎద సాగువైపు మెగ్గు చూపారు. కానీ గత కొన్ని రోజులుగా వరుణుడు ముఖం చాటేసాడు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలను నమోదు కావడంతో జిల్లాలోని వరి పంట ఎండిపోతుంది. పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
కొంతమంది రైతులు బోర్ల ద్వారా వరిపంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తే… మరికొంతమంది ఇంజన్లు ద్వారా వరినాట్లు తడిపి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తోటపల్లి ప్రోజెక్ట్ నీరు అందుబాటులో ఉండి పోలాలకు రాకపోవడం అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తున్నారు రైతులు. ఆధునీకరణ జరగకపోవడం, కొన్ని కాలువలలో అస్సలు పూడికలు తీయకపోవడంతో నీరు పొలాలకు అందటంలేదు.
గతంలో చేసిన అప్పులకు వడ్డీకట్టలేని స్థితిలో రైతాంగం ఉంది. కొన్ని చోట్ల కాలువలు ఉన్నా నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంలో వాటిలో చెత్తా చెదారం చేరిపోయాయి. వీటి పూడిక తీతలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పంటలు నాశనమవుతున్నాయి. తోటపల్లి ఓల్డ్ రెగ్యూలేటర్ పనులు ప్రారంభమయినా అక్కడ కూడా అదే పరిస్థితి దీనితో నీళ్ళు ఉండి పంటను కాపాడుకోలేని పరిస్థితి ఉంది.
ఓ వైపు అధికారుల నిర్లక్ష్యం . ప్రకృతి ప్రకోపం వెరసి అన్నదాత ఆగమౌతున్నాడు . వరుణుడు కరుణ లేఖ దీనంగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నాడు. వ్యవసాయం చేయాలంటే భయంగా ఉందని ఊరు వదిలి వెళ్ళలేక పెట్టుబడులు పెడుతున్నామని చెబుతున్నారు. తోటపల్లిని ఆధునీకరించి నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్ళేలా అధికారులు , పాలకులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
-
Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
-
Sunny Leone: అడ్డంగా బుక్కైన సన్నీలియోన్.. రంగంలోకి దిగిన సీఐడీ! అసలేం జరిగిందంటే..
-
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!