Site icon NTV Telugu

SL vs NED: ఎట్టకేలకు బోణీ కొట్టిన లంకేయులు.. నెదర్లాండ్కు వరించని లక్

Sri Lanka

Sri Lanka

ప్రపంచకప్ 2023లో శ్రీలంక ఎట్టకేలకు తన ఖాతా ఓపెన్ చేసింది. లక్నోలో నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అసలు ఈ మ్యాచ్లో నెదర్లాండ్ జట్టు గెలవడం కంటే మంచి ప్రదర్శన చూపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్.. 100 పరుగుల లోపే 6 వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఎంగెల్‌బ్రాండ్ (70), వాన్ వైక్ (55) అద్భుత ఇన్నింగ్స్ ఆడి స్కోరును పరుగులు పెట్టించారు. దీంతో నెదర్లాండ్ 49.4 ఓవర్లకు 262 పరుగులు చేసింది. ఇక శ్రీలంక బౌలింగ్లో దిల్షాన్ మధుశంక 4, రజిత 4 వికెట్లు తీశారు. స్పిన్నర్ తీక్షణ ఒక వికెట్ సాధించాడు.

Read Also: Missing: గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు

263 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. శ్రీలంక బ్యాటింగ్లో సమరవిక్రమ(91) పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నిస్సంకా(54), చరిత్ అసలంక (44), డి సిల్వ (30) పరుగులు చేసి వరల్డ్ కప్ 2023లో తొలి విజయాన్ని అందుకున్నారు. నెదర్లాండ్స్ బౌలింగ్లో ఆర్యన్ దత్ 10 ఓవర్లలో 44 పరుగులిచ్చి ముగ్గురు ఆటగాళ్లను ఔట్ చేశాడు. పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్‌మాన్ తలో వికెట్ తీశారు.

Read Also: Israel: ఇజ్రాయిల్‌తో యుద్ధానికి సిద్ధమవుతున్న హిజ్బుల్లా.. భారీ మూల్యం చెల్లించుకుంటారు..

ఇదిలా ఉంటే.. ఇంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్ సంచలన విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో లక్ బాగుండో లేదంటే.. ఆ రోజు వర్షం పడి బౌలర్లకు సహకరించడమో తెలియదు కానీ.. మొత్తానికైతే ఘన విజయం సాధించారు. అయితే అదే ధీమాతో ఈరోజు కూడా గెలుస్తామని అనుకున్నారు. స్కోరు కూడా 260 పరుగులు దాటడంతో.. మరో గెలుపును ఖాతాలో వేసుకున్నారు. కానీ అంచనా తారుమరైంది. దీంతో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్కు లక్ వరించలేదు.

Exit mobile version