CM YS Jagan: సీఎం జగన్‌తో శ్రీలంక ప్రతినిధుల భేటీ.. విషయం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ డి వెంకటేశ్వరన్, ఇతర అధికారులు.. ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వచ్చి.. సీఎం జగన్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. శ్రీలంకలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని కోరారు శ్రీలంక ప్రతినిధులు.. దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.. శ్రీలంక నుంచి భారత దేశానికి వచ్చే భక్తుల్లో 50శాతం మంది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వస్తారని, వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి విన్నామని ఈ సందర్భంగా ఏపీ సీఎంకు తెలిపారు శ్రీలంక ప్రతినిధులు.
Read Also: Anam Jayakumar Reddy: ఆనం ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. వైసీపీలో చేరిన రాంనారాయణరెడ్డి సోదరుడు
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి విన్న తర్వాత సీఎం వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలన్న తమ అధ్యక్షుడు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిని కలిసినట్లు శ్రీలంక ప్రతినిధులు తెలిపారు.. వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ వెంకటేశ్వరన్‌లు వెల్లడించారు.. ఆక్వారంగం, వాటి ఎగుమతుల్లో ఏపీ గణనీయ ప్రగతి సాధించిన నేపథ్యంలో… శ్రీలంకలో కూడా ఆక్వారంగ ప్రగతికి సహకారం అందించాలని కోరారు శ్రీలంక ప్రతినిధులు. కోవిడ్, దిగుమతులు కారణంగా దెబ్బతిన్న శ్రీలంక ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడుతోందని, ఖనిజవనరులు, పర్యాటకరంగంలో పెట్టుబడులుకు శ్రీలంక ప్రభుత్వం ఆహ్వానిస్తోందని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తెలిపారు ప్రతినిధులు.
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..