Site icon NTV Telugu

Asia Cup 2023 : పాక్ లో ఆసియాకప్ ఆడేందుకు నిరాకరించిన ఆ రెండు టీమ్స్

Asin Cup

Asin Cup

ఆసియాకప్‌కు పాకిస్థాన్‌లో ఆతిథ్యమిచ్చే అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. ఆసియా కప్ పాకిస్తాన్‌లో జరిగితే, భారత జట్టు ఆడటానికి వెళ్ళకూడదని తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని గతంలోనే బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయంతో పాకిస్థాన్ కష్టాల్లో పడింది. తటస్థ వేదికలో ఆసియా కప్‌ను నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు పాకిస్థాన్ అంగీకరించింది. 2023 ఆసియా కప్‌ను పాకిస్థాన్‌లో నిర్వహించేందుకు పీసీబీ తీవ్రంగా ట్రై చేస్తుంది. అయితే ఈ పోరాటంలో పాకిస్థాన్‌కు పొరుగు దేశాల క్రికెట్ బోర్డులు మాత్రం సపోర్ట్ ఇవ్వడం లేదు. ఆసియా కప్ విషయంలో బంగ్లాదేశ్, శ్రీలంకల మద్దతు పాకిస్థాన్‌కు లభించడం లేదు. ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డుల మద్దతు BCCI వైపే తమ మద్దతును ప్రకటించాయి.

Also Read : Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్.. థియేటర్ లో బ్లాస్టే

ఆసియా కప్‌కు ఆతిథ్యమివ్వడంపై భారత్, పాకిస్థాన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌ను బీసీసీఐకి ప్రతిపాదించింది. అయితే దీనికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ మాత్రం ఇప్పటి వరకు ఆమోదం లభించలేదు. హైబ్రిడ్ మోడల్ ప్రకారం ఆసియా కప్ పాకిస్థాన్‌లో జరుగనుంది. యూఏఈలో భారత్‌కు సంబంధించిన మ్యాచ్‌లు మాత్రమే జరుగుతాయి. కానీ, దీనికి బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. ఆసియా కప్ మొత్తాన్ని తటస్థ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుంది.

Also Read : IPL 2023 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

పాకిస్థాన్‌లో ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వకుంటే టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనబోదని పాకిస్థాన్ బోర్డు ఛైర్మన్ నజం శెట్టి వెల్లడించారు. ఈ ఏడాది భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ క్లారిటీ ఇచ్చింది. ఆసియా కప్‌ను సొంతంగా తరలించేందుకు పీసీబీ అంగీకరించకపోతే, టోర్నీ నిర్వహణ బాధ్యతను కూడా ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకునే అవకాశం ఉంది.

Exit mobile version