SRH vs PBKS: అభిషేక్ శర్మ విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్..!
- సన్‌రైజర్స్ హైదరాబాద్ 219 పరుగుల భారీ స్కోర్ నమోదు
- పంజాబ్ ముందు 220 పరుగుల టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH vs PBKS: ముల్లన్ పూర్ (న్యూ చండీగఢ్) వేదికగా జరుగుతున్న 17వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పంజాబ్ కింగ్స్ జట్టు ముందు భారీ టార్గెట్ ను సెట్ చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఆరంభం నుంచే లక్ష్యంగా చేసుకున్న హైదరాబాద్ ఓపెనర్లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోగా, హైదరాబాద్ బ్యాటర్లు మాత్రం ఆ నిర్ణయం తప్పని నిరూపిస్తూ నిర్ణిత 20 ఓవర్స్లో 219 పరుగుల భారీ స్కోరును సాధించారు.
PM Modi: బుజ్జగింపు రాజకీయాలు చేయం, బెంగాలీలను మైనారిటీలుగా కానివ్వం..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇక SRH ఇన్నింగ్స్ విషయానికి వస్తే.. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కేవలం 28 బంతుల్లోనే 8 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లను చెడుగుడు ఆడేసాడు. అతనికి తోడుగా ట్రావిస్ హెడ్ 23 బంతుల్లో 38 పరుగులతో ధాటిగా ఆడటంతో మొదటి వికెట్‌కు 8.1 ఓవర్లలోనే 120 పరుగులు నమోదయ్యాయి. ఈ జోడిని శశాంక్ సింగ్ విడదీసినప్పటికీ.. అప్పటికే హైదరాబాద్ భారీ స్కోరుకు పునాది వేసింది.
ఓపెనర్లు పెవిలియన్ చేరిన తర్వాత కెప్టెన్ ఇషాన్ కిషన్ (27) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మిడిల్ ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్ నెమ్మదిగా ఆడినప్పటికీ, చివర్లో అనికేత్ వర్మ (18 పరుగులు) మెరుపులు మెరిపించాడు. హెన్రిచ్ క్లాసెన్ 33 బంతుల్లో 39 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖర్లో అవుట్ అయ్యాడు. చివరికి సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 219 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్‌ను ముగించింది.
IPL 2026లో అదిరిపోయిన ఇన్నింగ్స్ మ్యాచ్‌లను మలుపు తిప్పేసిన హీరోలు వీరే!
పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీసినప్పటికీ 4 ఓవర్లలో భారీగా 50 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక శశాంక్ సింగ్ 3 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి కీలకమైన ఓపెనర్ల వికెట్లు పడగొట్టి హైదరాబాద్ బ్యాటర్స్ దూకుడికి బ్రేకులు వేశాడు. జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. చుడాలిమరి మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ కింగ్స్ 220 పరుగుల భారీ లక్షాన్ని ఎలా ఛేదిస్తుందో.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!