CSK Vs SRH: టాస్ గెలిచిన సీఎస్కే.. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. ఇరు జట్లలోకి కొత్త ప్లేయర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య హోరాహోరీ పోరు మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కూడా తమ విజయాల జోరును కొనసాగించేందుకు కీలక మార్పులతో బరిలోకి దిగాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఈసారి ఎంఎస్ ధోనీ తుది జట్టులో లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ధోనీ స్థానంలో సంజూ శామ్సన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. అలాగే, బౌలింగ్ విభాగంలో ఖలీల్ అహ్మద్‌కు బదులుగా ముకేష్ చౌదరిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ జట్టులోకి పేసర్ దిల్షాన్ మదుశంక రాగా.. చెన్నై యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌కు అవకాశం ఇచ్చింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే.. గత మ్యాచ్‌లో రాజస్థాన్‌పై అద్భుతంగా రాణించిన యువ పేసర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా భారీ స్కోరుపై కన్నేశారు.
Also Read
- GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
- Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
- Shreyas Iyer Captaincy: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు.. మ్యాచ్ మొత్తం తప్పిదాలే?
- Shreyas Iyer: పొరపాట్లు చేశా, సరైన ప్లానింగ్ లేదు.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్!
తుది జట్లు (Playing XI):
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలిల్ అరోరా (కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింజ్, సాకిబ్ హుస్సేన్, ఈషన్ మలింగ.
చెన్నై సూపర్ కింగ్స్: సంజూ శామ్సన్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జేమీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, గుర్జాపనీత్ సింగ్. (ఇంపాక్ట్ ప్లేయర్: ముకేష్ చౌదరి).
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ 6వ స్థానంలో ఉండగా.. సీఎస్కే 8వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ విజయం ఇరు జట్లకు ప్లేఆఫ్స్ రేసులో చాలా కీలకం కానుంది.
తాజావార్తలు
-
GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
-
Anjanadri Temple: బంగారం కాదు రాగి?.. ఆంజనాద్రి అంజన్న ఆలయంలో ఆభరణాల విరాళ వివాదం!
-
Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
-
AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
-
Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
ట్రెండింగ్
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!