SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ని నెలకొల్పింది సన్ రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ మ్యాచ్ పవర్‌ప్లే దశలో అత్యధిక స్కోర్‌ను సాధించింది ఎస్ఆర్‌హెచ్.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ఈ కొత్త రికార్డుకు వేదికగా మారింది.. రికార్డు స్థాయి ప్రదర్శనతో SRH మొదటి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 125 పరుగులు చేసింది. ఈ ఫీట్ జట్టు యొక్క దూకుడు బ్యాటింగ్ వ్యూహాన్ని చూపడమే కాకుండా.. లీగ్‌లో ఓపెనింగ్ భాగస్వామ్యాలకు కొత్త రికార్డును సెట్ చేస్తుంది. ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని అందుకోగా.. అభిషేక్ శర్మ 10 బంతుల్లో 40 పరుగులు చేశాడు. దీంతో.. హైదరాబాద్.. 2017లో డర్హామ్‌పై నాటింగ్‌హామ్‌షైర్ చేసిన 106/0 రికార్డును బద్దలు కొట్టింది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.. దీంతో.. హైదరాబాద్ బ్యాటింగ్‌కు దిగింది.
ఇక, టీ20 క్రికెట్‌లో అత్యధిక పవర్‌ప్లే స్కోర్లను ఓసారి పరిశీలిస్తే..
1) సన్‌రైజర్స్ హైదరాబాద్ – 125/0 vs ఢిల్లీ క్యాపిటల్స్, 2024
2) నాటింగ్‌హామ్‌షైర్ – 106/0 vs డర్హామ్, 2017
3) కోల్‌కతా నైట్ రైడర్స్ – 105/0 vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2017
4) సెయింట్ కిట్స్ మరియు నెవిస్ పేట్రియాట్స్ – 105/0 vs బార్బడోస్ ట్రైడెంట్స్, 2017
5) దక్షిణాఫ్రికా – 102/0 vs వెస్టిండీస్, 2023