IPL 2024: బ్రూక్‌తో పాటు మరి కొందరిని వదిలించుకునేందుకు SRH సిద్ధం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్-2023 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చూపించింది. అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై.. అభిమానులకు తీవ్ర నిరాశ పరిచింది. ఈ సీజన్లో కొత్త కెప్టెన్, కొత్త హెడ్‌కోచ్‌తో బరిలోకి దిగినప్పటికీ.. ఎస్ఆర్హెచ్ అత్యుత్తమ ప్రదర్శన చూపించలేకపోయింది. ఐపీఎల్ 2023లో 14 మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్.. కేవలం నాలుగు విజయాలను సాధించి పాయింట్ల పట్టికలో చివరలో నిలిచింది.
Etela Rajender: మీ నిర్లక్ష్యం వల్లే లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
అందుకు SRH టీమ్.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు తమ జట్టును మరోసారి ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. హెడ్ కోచ్ బ్రియాన్ లారాను తొలగించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. గత సీజన్లో పేలవ ప్రదర్శన చూపిన కొంతమంది ఆటగాళ్లపై వేటు వేయాలని చూస్తోంది. గత సీజన్ లో రూ.13.25 కోట్లు ఖర్చు పెట్టి.. కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Jasprit Bumrah: మంచి రిథమ్‌లో బౌలింగ్ చేస్తున్న బూమ్ బూమ్ బుమ్రా.. వీడియో ఇదిగో
హ్యారీ బ్రూక్.. 11 మ్యాచ్‌ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి అందరిని నిరాశకు గురిచేశాడు. ఈ క్రమంలోనే బ్రూక్ ను ఎస్ఆర్హెచ్ వదిలించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అతనితో పాటు రూ.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌లపై వేటు వేయడానికి సన్ రైజర్స్ సిద్దమైంది. ఈ సీజన్ లో సుందర్ గాయం కారణంగా టోర్నీ మధ్యలో తప్పుకోగా.. మాలిక్ బౌలింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన చూపలేదు. ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్.. 5 వికెట్లు మాత్రమే చేశాడు. వీరితో పాటు మరికొంత మందికి కూడా SRH ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించి మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?