Nithish Reddy: తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డికి జాక్‌పాట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithish Reddy Becomes Costliest Player in APL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డికి జాక్‌పాట్ తగిలింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్ 3కి సంబంధించిన వేలంలో నితీష్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఈ యువ ఆల్‌రౌండర్‌ను గోదావరి టైటాన్స్ రూ. 15.6 లక్షలకు దక్కించుకుంది. దాంతో ఏపీఎల్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నితీష్ నిలిచాడు. ఐపీఎల్ 2023 వేలంలో ఎస్ఆర్హెచ్ రూ. 20 లక్షల కనీస ధర కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2023 లో నితీష్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు రాలేదు. దాంతో మనోడి పేరు గతేడాది వెలుగులోకి రాలేదు. ఐపీఎల్ 2024లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. సంచలన ఇన్నింగ్స్‌లతో స్టార్ అయ్యాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన నితీష్.. 239 పరుగులు, మూడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాదించిన నేపథ్యంలో నితీష్ రెడ్డిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సన్‌రైజర్స్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Also Read
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
Also Read: Sunrisers Hyderabad: నాలుగేళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇక కప్పు మనదే!
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ప్రతిభ కలిగిన స్థానిక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావడమే ఈ టోర్నీ ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి అయ్యాయి. ఈ టోర్నీలో 6 జట్లు పోటీపడుతాయి. బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ ఆడుతున్నాయి. సీజన్ 3 కోసం గురువారం వేలం జరిగింది. ఈ వేలంలో 408 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జూన్ 30 నుంచి జూలై 13 వరకూ కడప, విశాఖ వేదికగా సీజన్ 3 మ్యాచ్‌లు జరగనున్నాయి.
NITISH KUMAR REDDY – Highest paid player in Andhra Premier League. 💥
IPL salary – 20 Lakhs.
APL salary – 15.6 Lakhs.His reaction is priceless. 🫡 The future star. pic.twitter.com/33i0hT3F3a
— Johns. (@CricCrazyJohns) May 16, 2024
తాజావార్తలు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!