Nitish Kumar Reddy: అంత బిజీగా ఉన్నా.. నాకు మెసేజ్ చేశాడు!
- ఐపీఎల్ 2024లో అత్యుత్తమ ప్రదర్శన
- 11 ఇన్నింగ్స్‌లలో 303 రన్స్
- త్వరలోనే మాట్లాడతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya and Ben Stokes are my inspirations Said Nitish Kumar Reddy: బాగా ఆడావ్ అని.. సీనియర్ నుంచి ఓ మెసేజ్ వస్తే జూనియర్‌కు అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. గాల్లో తేలిపోతుంటాడు. అలాంటి ఆనందం, సంతోషమే తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి అనుభవించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నితీశ్.. ఐపీఎల్ 2024 ముగిసిన తర్వాత టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నుంచి ఓ మెసేజ్ వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. తాను మెసేజ్ చూసి షాక్ అయ్యానని చెప్పాడు. గాయం నుంచి కోలుకుంటున్న తాను దులీప్ ట్రోఫీ కోసం సన్నద్ధమవుతున్నానని చెప్పాడు.
‘ఐపీఎల్ 2024 ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా నుంచి ఓ మెసేజ్ వచ్చింది. నేను షాక్ అయ్యాను. బాగా ఆడావ్ అని ప్రశంసించాడు. ఇదే ఇంటెంట్, ఎనర్జీతో ముందుకు కొనసాగాలని సూచించాడు. ఎప్పుడూ ఆటను గౌరవిస్తూ ఉండలన్నాడు. త్వరలోనే నాతో మాట్లాడతానని మెసేజ్ చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం సన్నద్ధమవుతూ.. ఫుల్ బిజీగా ఉన్న తరుణంలో నాకు మెసేజ్ పంపడంతో ఆశ్చర్యమేసింది. ఆ మెసేజ్‌కు థాంక్యూ అని రిప్లై ఇచ్చా’ అని నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. ఆల్‌రౌండర్‌గా ఎదిగేందుకు బెన్ స్టోక్స్, హార్దిక్ తనకు ఆదర్శమని చెప్పాడు.
Also Read
Also Read: Akash Puri: పేరు మార్చుకున్న ‘పూరీ’ కుమారుడు.. కారణం అదేనా?
ఐపీఎల్ 2024లో నితీశ్ కుమార్ రెడ్డి రాణించిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 21 ఏళ్ల నితీశ్ 11 ఇన్నింగ్స్‌లలో 303 రన్స్ చేశాడు. అంతేకాదు మూడు వికెట్స్ కూడా పడగొట్టాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో నితీశ్ రెడ్డికి భారత జట్టులో అవకాశం వచ్చింది. జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌కు అతడు ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా వైదొలగాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!