బుల్లితెర యాంకరమ్మ రాములమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన అందంతో, చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే..తాజాగా వినాయక చవితి సందర్బంగా ట్రెడిషినల్ గా రెడీ అయ్యింది. చీరలో, తడి అందాలతో చీరలో మెరిసింది…. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..
యాంకర్ శ్రీముఖి వరుస టీవీ షోలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకుంటోంది. స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూ తన అభిమానులు, ఆడియెన్స్ ను ఖుషీ చేస్తోంది.. ఇక శ్రీముఖి బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెట్టింట కూడా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ఇస్తూనే వస్తోంది. మరీ ముఖ్యంగా ప్రత్యేకమైన రోజు, పండగ వేళల్లో మరింత అందంగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది..
ఎప్పుడూ హాట్ గా రెడీ అయ్యిఘాటు పోజులుస్తున్న శ్రీముఖి కాస్త ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరిని షాక్ కు గురి చేసింది.. తాజాగా పంచుకున్న ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. స్విమ్మింగ్ పూల్‌లో ఆమె దిగి చేసిన ఫోటో షూట్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఓ వైపు పలుచని చీర, మరోవైపు తడిసిన అందాలు ఇలా డెడ్లీ కాంబినేషన్‌తో అసలైన అందాలు చూపిస్తూ దుమారం రేపింది..ఇటీవల `భోళాశంకర్` చిత్రలో నటించింది. `ఖుషి` సినిమాలోని భూమిక, పవన్ నడుము సీన్‌ని చిరుతో చేసి రచ్చ చేసింది. అంతకు ముందు `మ్యాస్ట్రో`, `క్రేజీ అంకుల్స్` చిత్రాల్లోనూ మెరిసి మెప్పించింది. కానీ సినిమా ఆమెకి పేరుని తీసుకురాలేకపోతున్నాయి. మరో కొత్త సినిమాలో నటిస్తోంది.. దాని గురించి ఇంక ప్రకటించలేదు..