టాలివుడ్ ప్రేక్షకులను తన కొంటె చూపులతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ శ్రీలీలా.. తన అందం, నటన, డ్యాన్స్ తో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. వరుసగా అవకాశాలు సాధిస్తోంది. ప్రస్తుతం డజను సినిమాలకు పైగా తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ.. ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా ఏడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..టాలివుడ్ లోకి మెరుపు తీగలా వచ్చి దూసుకుపోతుంది.. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.
ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోస్ తో యువతను ఆకట్టుకుంటుంది..తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. ఆరెంజ్ కలర్ డ్రస్ లో… అందాలు ఆరబోస్తూ.. చిరునవ్వులతో చంపేస్తోంది బ్యూటీ. ప్రస్తుతం శ్రీలీలా ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ గట్టిగా వినిపిస్తున్న ఏకైక హీరోయిన్ పేరు శ్రీలీల. స్టార్ హీరోలు.. యంగ్ హీరోలు కూడా శ్రీలీలా ఉంటే సినిమా హిట్లు అన్నట్టుగా మారిపోయింది. ఇండస్ట్రీ మొత్తం యంగ్ హీరోయిన్ శ్రీలీల జపం చేస్తున్నారు. అంతే కాదు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తుందని టాక్..
ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా 12 సినిమాలు ఉన్నాయి. కృతీ శెట్టి లాంటివారిని పక్కకు నెట్టి.. టాలీవుడ్ ను ఏలేస్తోంది బ్యూటీ..పవన్ , మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది..ఈ ఏడాది ఈమె నటించిన మూడు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి..వీటితో పాటు.. ‘ఆదికేశవ’, ‘స్కంద’, ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘భగవంత్ కేసరి’, VD12, అనగనగ ఒక రాజు, ఎక్ట్రార్డినరీ మ్యాన్ లాంటిసినిమాలు చేస్తోంది.. టాలివుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బిజీ హీరోయిన్ అయ్యింది ఈ అమ్మడు..