SPIRIT : ‘స్పిరిట్’ తెలుగు స్టేట్స్ రైట్స్ మైత్రి మూవీస్ & పీపుల్ మీడియా చేతికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రభాస్ కెరీర్‌లో 25వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా దక్కించుకున్నట్లు సమాచారం.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు సంస్థలు ‘స్పిరిట్’ తెలుగు వెర్షన్ హక్కుల కోసం కళ్లు చెదిరే భారీ మొత్తాన్ని వెచ్చించాయి. ప్రభాస్ మార్కెట్ క్రేజ్ మరియు సందీప్ వంగా మేకింగ్‌పై ఉన్న నమ్మకంతో టాలీవుడ్ చరిత్రలోనే భారీ ధరకు ఈ సినిమా రైట్స్ డీల్ క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. మొదటిసారి చేతులుకలిపిన మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కొత్త సమీకరణాలకు తెరలేపింది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు సందీప్ రెడ్డి. బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని 2027 మార్చి 5గా ప్రకటించారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు జపనీస్, కొరియన్ భాషల్లో కూడా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.
Also Read
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!