NTV Telugu Site icon

Vizag Crime: ఏం కష్టం వచ్చిందో..? విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Shooting

Shooting

Vizag Crime: విశాఖపట్నంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్య కలకలం రేపుతోంది.. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శంకర్రావు గన్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు.. ఈ రోజు ఉదయం 5 గంటలకు డ్యూటీకి వెళ్లిన శంకర్రావు తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని విశాఖ పోలీసులు చెబుతున్నారు.. అయితే, ఐవోబీ బ్యాంకులో గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు శంకర్రావు.. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ద్వారక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది.. అయితే, ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. అసలు శంకర్రావు ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏమిటి అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కుటుంబ సమస్యలా? లేదా విధుల్లో ఒత్తిడి ఏమైనా ఉందా? ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ సాగుతోంది.

Read Also: Eid Ul Fitr 2024: దేశ ప్రజలకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ ఈద్‌ శుభాకాంక్షలు

Show comments