Maha Kumbh Mela 2025: ఏపీ ప్రజలకు అలర్ట్.. మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు!
- జనవరి 13 నుంచి మహా కుంభమేళా
- విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
- తిరుపతి-బెనారస్ ప్రత్యేక రైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రజలకు రైల్వేశాఖ తీపి కబురు చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని.. మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో తిరుపతి-బెనారస్ (07107) ప్రత్యేక రైలు నడవనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి-బెనారస్ (07107) ప్రత్యేక రైలు జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో శనివారం రాత్రి 8.55 గంటలకు తిరుపతిలో బయలుదేరి.. సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు బెనారస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07108 నంబరు రైలు జనవరి 20, ఫిబ్రవరి 10, 17, 24 తేదీల్లో బెనారస్‌లో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరుతుంది.
తిరుపతి-బెనారస్ ప్రత్యేక రైలు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజ మహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగుడ రైల్వే స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. జనవరి 26, ఫిబ్రవరి 2 తేదీల్లో నర్సాపూర్-బెనారస్ (07109) ప్రత్యేక రైలు కూడా నడవనుంది. నర్సాపూర్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3.45 గంటలకు బెనారస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 27, ఫిబ్రవరి 3 తేదీల్లో 07110 నంబరు రైలు బెనారస్‌లో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు చెప్పుకొచ్చారు.
Also Read
- PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
- Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
- Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
- Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
Also Read: Buddha Venkanna: బీసీల ముద్దుబిడ్డ, వెనుకబడిన తరగతుల పక్షపాతి చంద్రబాబు!
మహా కుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ సిద్ధమవుతోంది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు.. 45 రోజుల పాటు మహా కుంభమేళా జరగనుంది. ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత కోసం పారామిలిటరీ బలగాలు సహా 50 వేల మంది సిబ్బంది మోహరించనున్నారు. కుంభమేళా సమాచారం తెలుసుకునేందుకు 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్‌బాట్ అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
AVD తర్వాత మరో మల్టీప్లెక్స్.. నార్త్ హైదరాబాద్‌పై రౌడీ హీరో కన్ను!
-
PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
-
Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!