Murali Mohan : లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది: పద్మశ్రీపై మురళీ మోహన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాగంటి మురళీ మోహన్ ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించారు. ‘జగమే మాయ’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మురళీ మోహన్, క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకుని 350కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శం. మురళీ మోహన్ కేవలం హీరోగానే కాకుండా సహాయ నటుడిగా, విలన్‌గా కూడా రాణించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. నిర్మాతగా ఆయన స్థాపించిన జయభేరి ఆర్ట్స్ బ్యానర్ టాలీవుడ్‌లో ఎన్నో క్లాసిక్ సినిమాలకు వేదికైంది.రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా ఆయన సేవా దృక్పథం కొనసాగింది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ ఎంపీగా గెలిచిన మురళీ మోహన్, తన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విద్య, వైద్య రంగాల్లో ఆయన చేసిన సామాజిక సేవలు ఎందరికో మేలు చేకూర్చాయి. మాగంటి మురళీ మోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం ఆయన మానవతా దృక్పథానికి నిదర్శనం. రాజకీయాల్లో ఉన్నా సినిమా రంగాన్ని ఆయన ఎన్నడూ మర్చిపోలేదు. సుదీర్ఘ కాలంగా పద్మ పురస్కారాల కోసం ఆయన పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ, 2026లో ఈ గౌరవం దక్కడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు
Also Read : LokeshKanagaraj : ఖైదీ 2 వాయిదా వెనక స్టోరీ ఏంటో చెప్పిన లోకేష్ కనకరాజ్
Also Read
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- 2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
తాజాగా గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తనకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ హర్షం వ్యక్తం చేశారు.‘‘అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డు నిన్న సాయంత్రం ప్రకటించినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్ చేశారు. ‘మీకు ఎప్పుడో రావాల్సింది.. ఇప్పుడైనా వచ్చింది’ అని అంటుంటే.. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది అని చెప్పాను. అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. ఏదైనా ఎదురు చూపుల తర్వాత దొరికితే దాని విలువ ఎక్కువ. మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ఇంత మంచి అవార్డును ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీగారికి,ఏపీ సీఎం చంద్రబాబు గారికి, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గారికి, చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులందరికీ కృతజ్జతలు. అవార్డు అందుకున్న తర్వాత వివరంగా ప్రెస్‌మీట్ పెట్టి చెబుతాను. థ్యాంక్యూ’’ అంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
తాజావార్తలు
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!