ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటే దేశంలోనే ఒక ప్రత్యేకమైన పాపులారిటీ ఉంది. యూపీలో సంచలన నిర్ణయాలను అమలు చేస్తూ సీఎం యోగి పాపులర్ అయ్యారు . అయితే ఇంతకాలం యోగి ఆదిత్యనాథ్ తీసుకునే నిర్ణయాలను బిజెపి కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు మెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న యూపీ అసెంబ్లీలో ఏకంగా సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే యోగి ఆదిత్యనాథ్ ను ప్రశంసించారు. ఆయన పాలనను పొగడ్తలతో అసెంబ్లీ వేదికగా ముంచేస్తారు. మా పార్టీలో గెలిసి మేం వ్యతిరేకించే బిజెపి ముఖ్యమంత్రిని, ఎలా ప్రశంసిస్తారంటూ వెంటనే మహిళ ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. అంతేకాదు పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వ్యతిరేకించిన ఇటువంటి నిర్ణయాలే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ఇంతకీ సీఎంను ఎమ్మెల్యే ఎందుకు ప్రశంసించారు?
సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ యూపీ అసెంబ్లీలో ‘విజన్ డాక్యుమెంట్ 2047’ పై చర్చలో పాల్గొన్నారు. గతంలో యూపీలో రౌడీల రాజ్యం నడిచిందని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా యోగి బాధ్యతలు తీసుకున్నాక, రౌడీల భరతం పట్టారని ఎమ్మెల్యే పూజ పాల్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. రౌడీలకు తాను కూడా బాధితురాలిననని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే.. 2005లో ప్రస్తుత ఎస్పీ ఎమ్మెల్యే పూజా పాల్ భర్త రాజుపాల్బిఎస్పి ఎమ్మెల్యేగా ఉన్నారు. వివాహం జరిగిన పది రోజులకే పూజా పాల్ భర్తను హత్య చేశారు. అప్పట్లో బిఎస్పి ఎమ్మెల్యే రాజ పాల్ హత్య సంచలనంగా మారింది. రాజ్ పాల్ నువ్వు హత్య చేసిన ఆష్రాఫ్ అహ్మద్, తన సోదరుడు అతిక్ సాయంతో రాజ్ పాల్ ను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే హంతకులు ఆ తర్వాత గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయ నేతలుగా ఎదిగారు. అప్పట్లో ప్రభుత్వాలు కానీ, పోలీసులు కానీ వాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు
ఈ మధ్యకాలంలో యూపీలో బిజెపి అధికారంలోకి వచ్చాక, రాష్ట్రంలోని రౌడీల పని పట్టారు. అతిక్ , అష్రాఫ్ లిద్దరూ ఓ కేసులో దోషులుగా తేలగా, వాళ్లను జైలుకు తరలించే క్రమంలో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు . అక్కడ జర్నలిస్టులుగా వచ్చిన ముగ్గురు వ్యక్తులు అన్నదమ్ములు ఇద్దరిని కాల్చి చంపారు. ఏదేమైనా తన భర్తను హత్య చేసిన వాళ్ళిద్దరికీ యోగి ప్రభుత్వంలోనే శిక్ష పడిందని మహిళ ఎమ్మెల్యే స్పష్టం చేసింది. దాంతో మహిళ ఎమ్మెల్యేను తమ పార్టీ నుంచి బహిష్కరించారు.