NTV Telugu Site icon

Southwest Monsoon: గుడ్ న్యూస్.. మే 31న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు!

Southwest Monsoon

Southwest Monsoon

Southwest Monsoon Likely to hit Andaman Coast on May 19th: తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత ఏడాది అంతంత మాత్రంగానే కురిసిన వర్షాలు.. ఈ ఏడాది మాత్రం ఆశాజనకంగా ఉంటాయని తెలిపింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీ మాన్‌సూన్ రెయిన్స్ ప్రారంభమయ్యాయి. దక్షిణ విదర్భ నుంచి కర్నాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక వద్ద ఉపరితల ద్రోణి తాకనుంది.

Also Read: YS Jagan: జూన్ 4న ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుంది: వైఎస్‌ జగన్‌

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. రానున్న మూడు రోజులు తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 19వ తేదీన అండమాన్ తీరాన్ని తాకనున్నాయి. నైరుతి రుతుపవనాలు మే 31న కేరళకు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. కేరళను నైరుతి పవనాలు తాకిన తర్వాతే.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ అధికారిని సునంద పేర్కొన్నారు. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. జూన్, జూలై నెలలు వ్యవసాయానికి చాలా ముఖ్యమైనవి అన్న విషయం తెలిసిందే.