Prakasam Barrage Flood Alert: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీరు ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
Southwest Monsoon Likely to hit Andaman Coast on May 19th: తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత ఏడాది అంతంత మాత్రంగానే కురిసిన వర్షాలు.. ఈ ఏడాది మాత్రం ఆశాజనకంగా ఉంటాయని తెలిపింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీ మాన్‌సూన్ రెయిన్స్ ప్రారంభమయ్యాయి. దక్షిణ విదర్భ నుంచి కర్నాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక వద్ద…
పాకిస్థాన్‌లో ఎడతెరపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నగరాలు నీట మునుగుతున్నాయి. జూన్ 25 నుంచి కురుస్తున్న రుతుపవన వర్షాల కారణంగా దాదాపు 86 మంది మరణించగా.. 151 మంది గాయపడినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ) నివేదించింది.
గత నెల నుంచి పాకిస్తాన్‌లో కురుస్తున్న రుతుపవనాల వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది చిన్నారులతో సహా కనీసం 50 మంది మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చాలా చురుకుగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో మరో మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ పొంగిపొర్లడంతో దాదాపు 3000 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇక్కడ గుర్తు చేశారు. గురువారం ఉదయం నుంచి కొంత విరామం లభించినప్పటికీ కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అల్వాల్, అమీర్‌పేట్, పంజాగుట్ట,…