NTV Telugu Site icon

Tamil Nadu CM: దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలు ఈసారి బీజేపీకి ఓట్లు వేయరు..

Tamil Nadu

Tamil Nadu

లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి అయితే దేశం ఇంకోసారి సార్వత్రిక ఎన్నికలను చూడబోదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. భారత్‌లో ఉన్న ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మార్చి వేసి.. నిరంకుశత్వాన్ని తీసుకువస్తారని మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశం నిరంకుశ రాజ్యంగా మారకుండా అడ్డుకోవటమే తమ పార్టీ ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలో వస్తే.. బీజేపీకి కూడా ఎలాంటి లబ్ధి జరుగదు అని తెలిపారు. నెమ్మదిగా బీజేపీ పార్టీ తన ఉనికి కోల్పోతుంది.. కేవలం నరేంద్ర మోడీ మాత్రమే మిగులుతారని ఎద్దేవా చేశారు.

Read Also: Israel- Hamas War: ఇజ్రాయెల్ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్..!

ఇక, బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో చేస్తున్న ఎన్నికల ప్రచారంపై అడిగిన ప్రశ్నకు సీఎం స్టాలిన్ స్పందిస్తూ.. ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీ ప్రభావం రోజు రోజుకు తగ్గిపోతుందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీకి ఈసారి ఎ‍న్నికల్లో కూడా ఓట్లు వేయరని పేర్కొన్నారు. ఇండియా కూటమిలో ప్రధాన మంత్రి అభ్యర్థి ఎ‍న్నికల ఫలితాల తర్వాత తెర మీదకు వస్తుందని చెప్పారు. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థులుగా సమర్థులైన, అనుభవం గల నేతలు చాలా మంది ఉన్నారని సీఎం స్టాలిన్ గుర్తు చేశారు.

Read Also: Cyber Fraud: అమాయకులపై సైబర్‌ పంజా.. ట్రేడింగ్‌ పేరుతో 16 లక్షలు టోకరా..

కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శ్రీలంకను చాలా సార్లు వెళ్లారు.. ఎందుకు ఒ‍క్కసారి కూడా కచ్చతీవు ద్వీపం గురించి మాట్లాడలేదని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల వేళ కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై మోడీ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, 39 స్థానాలు ఉ‍న్న తమిళనాడులో ఏప్రిల్‌ 19వ తేదీన ఒకే దశలో పోలింగ్‌ జరనుంది. ఫలితాలు జూన్‌ 4వ తేదీన విడుదల కానున్నాయి.