బీజేపీపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనను బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందంటూ ఫైరయ్యారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కరూర్ ఘటనను బీజేపీ వాడుకుంటోంది తప్ప.. తొక్కిసలాట గురించి మాత్రం ఆందోళన లేదని వ్యాఖ్యానించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బీహార్ పర్యటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. బీహార్‌లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో బుధవారం స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్, డీఎంకే నేతలు గతంలో బీహారీయులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ గుర్తు చేసింది. వీటికి సమాధానం ఏదంటూ నిలదీస్తోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. తమిళనాడు మెట్రో ప్రాజెక్ట్‌లకు అందించాల్సిన నిధులు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు నిధులు విడుదల చేశారని.. తమిళనాడు నిధులు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ అమెరికా పర్యటనలో కొంత సమయం జాలిగా గడిపారు. షికాగో సరస్సు తీరంలో సరదాగా సైకిల్ తొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో అందర్నీ ఆకర్షించింది. కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ మద్దతుగా నిలిచారు. శనివారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం మమత ప్రసంగిస్తుండగా మైక్ కట్ అయింది.
లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి అయితే దేశం ఇంకోసారి సార్వత్రిక ఎన్నికలను చూడబోదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.
Tamil Nadu CM MK Stalin Meets Novak Djokovic: టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కలిశారు. స్పెయిన్‌కు వెళ్లే మార్గంలో విమానంలోనే జొకోవిచ్‌ను స్టాలిన్ కలుసుకున్నారు. కాసేపు టెన్నిస్ దిగ్గజంతో మాట్లాడిన సీఎం.. ఆపై ఫొటో దిగారు. ఈ పోటోలను స్వయంగా తమిళనాడు సీఎం తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విమానంలో జొకోవిచ్‌ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని, అతడిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ‘ఆకాశంలో…
చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో సీఎం స్టాలిన్ నడుచుకుంటు వెళ్తున్న సమయంలో కాలు స్లిప్ కావడంతో పక్కనే ఉన్న ప్రధాని మోడీ ఆయన ఎడమ చేతి పట్టుకుని ముందుకు నడిపించాడు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనారోగ్యంతో హస్పటల్ లో చేరారు. నిన్నటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షల్లో వైరల్ ఫీవర్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు.
తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతోన్న నేపథ్యంలో సీఎం సహాయ నిధికి సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.50 లక్షల సాయం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి స్వయంగా అందజేశారు. కాగా తమిళ హీరోలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి కరోనా సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సూర్య, కార్తీ సోదరులు కోటి విరాళం అందించగా, మురుగదాస్ రూ. 25 లక్షలు, అజిత్ 25 లక్షలు అందజేశారు. వీళ్లతో పాటు…