Site icon NTV Telugu

India vs South Africa: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. తగ్గని సూర్యకుమార్ కాన్ఫిడెన్స్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..

South Africa Won Toss

South Africa Won Toss

India vs South Africa: అహ్మదాబాద్ వేదికగా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ కు సర్వ సిద్ధమైంది.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. గ్రూప్ దశలో వరుసగా 4 మ్యాచులు గెలిచి జోరు మీదున్న టీమిండియా ఫీల్డింగ్‌లోకి దిగనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అద్భుతమైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించింది భారత్. ఇది దక్షిణాఫ్రికాతో జరిగే కీలక పోరుకు ముందు భారత జట్టుకు ఈ ఫలితాలు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయి. అయితే.. ఈ టీమ్‌లో అభిషేక్ శర్మను యథాతథంగా ఉంచారు.

READ MORE: Allu Arjun: మెగా రికార్డుకు రీచ్ అయిన పుష్పరాజ్.. తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్!

టాస్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని, కానీ ఇప్పుడు బౌలింగ్ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. జట్టులో మంచి ఎనర్జీ ఉందని, ఫలితం ఏదైనా వచ్చినా స్వీకరిస్తామని పేర్కొన్నాడు. అక్షర్ పటేల్‌పై కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. అయినప్పటికీ గత మ్యాచ్ ఆడిన అదే జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని, ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించాడు. అనంతరం.. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ.. వికెట్ చాలా బాగా ఉందని, గత మ్యాచ్‌లతో పోలిస్తే మరింత డ్రైగా ఉందని చెప్పాడు. ముందుగా బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉందని, జట్టు మంచి ఫామ్‌లో ఉందని తెలిపాడు. ఈ మైదానంలో ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు ఆడిన అనుభవం తమకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే నాలుగు మార్పులు చేశామని, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్‌గిడి, మార్కో జాన్సన్ తిరిగి జట్టులోకి వచ్చారని చెప్పాడు.

READ MORE: The Kerala Story 2: ‘‘ఇలా గొడ్డు మాంసం ఎవరు తినిపిస్తారు.?’’ కేరళ స్టోరీపై అనురాగ్ కశ్యప్ విమర్శలు..

టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రస్తానం తొలుత యూఎస్ మ్యాచ్‌తో ప్రారంభమైంది. అమెరికా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స్వల్పంగా తడబడిన భారత జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. అనంతరం నమీబియాపై 93 పరుగుల భారీ విజయంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌ను సులభంగా గెలిచిన భారత్, నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్ దశను అజేయంగా ముగించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ ప్రత్యర్థులను డిఫెండ్ చేస్తూ గెలిచింది. టాస్ మాత్రం నెదర్లాండ్స్‌పై మాత్రమే ఒక్కసారి గెలిచింది. మిగతా మూడు మ్యాచుల్లో టాస్ ఓడింది. ఈ టోర్నీలో భారత బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 176 పరుగులు చేసి 202.30 స్ట్రైక్‌రేట్‌తో జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి 9 వికెట్లతో 6.89 సగటుతో వికెట్‌ల పట్టికలో ముందంజలో ఉన్నాడు. మొత్తం భారత్ సాధించిన 35 వికెట్లలో 18 పేసర్లు, 17 స్పిన్నర్లు తీసుకోవడం బౌలింగ్ విభాగం ఎంత సమతుల్యంగా, రిధమ్‌లో ఉందో స్పష్టంగా చూపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అభిషేక్ శర్మ ఇప్పటివరకు ఈ టోర్నీలో ఒక్క పరుగూ చేయకపోయినా టీమిండియా ఆధిపత్యం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ జట్టు: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి

దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రియన్ రికెల్టన్, డేవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సన్, కార్బిన్ బోష్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, లుంగి ఎన్‌గిడి.

 

 

 

 

Exit mobile version