టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో టీ20లో రెండు వికెట్స్ తీయడంతో వరుణ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ సిరీస్‌లో ఈ మిస్టరీ స్పిన్నర్ ఇప్పటివరకు 10 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ స్పిన్నర్…