బిగ్‍బాస్ తెలుగు 5వ సీజన్‍తో ఎంతో పాపులర్ అయిన వీజే సన్నీ ఆ సీజన్‍లో విజేతగా నిలువడంతో పాటు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించాడు.ఆ జోష్‍తోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో విజే సన్నీ హీరోగా నటించిన సౌండ్ పార్టీ సినిమా గతేడాది నవంబర్ 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.. ఇప్పుడు సౌండ్ పార్టీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది.సౌండ్ పార్టీ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ కాబోతుంది.మార్చి 8వ తేదీన ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (మార్చి 4) అధికారికంగా వెల్లడించింది.”సౌండ్ డీటీఎస్‍లో మోగిద్దామా. ఆహాలో సౌండ్ పార్టీ. మార్చి 8న ప్రీమియర్ కానుంది” అని ఆహా ట్వీట్ చేసింది. బ్రైట్ కామెడీ మూవీ అంటూ ఓ పోస్టర్ ను ట్వీట్ చేసింది. సన్నీతో పాటు హీరోయిన్ హృతికా శ్రీనివాస్, శివన్నారాయణ ఈ పోస్టర్‌లో ఉన్నారు.
సౌండ్ పార్టీ సినిమా సుమారు 100 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.. అయితే ఈ చిత్రం థియేటర్ రిలీజ్ కు ముందుగా ఓటీటీ డీల్ కుదుర్చుకోలేకపోయింది. అయితే, ఆలస్యమైనా ఎట్టకేలకు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. దీంతో మార్చి 8న ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్‍కు రానుంది.సౌండ్ పార్టీ సినిమాలో వీజే సన్నీ, హృతిక శ్రీనివాస్ హీరోహీరోయిన్లుగా నటించగా.. శివన్నారాయణ, పృథ్విరాజ్, అలీ మరియు సప్తగిరి కీలకపాత్రలు పోషించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు సంజయ్ షేరి తెరకెక్కించారు
సౌండ్ పార్టీ చిత్రాన్ని ఫుల్ మూన్ మీడియా పతాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర మరియు శ్రీ శ్యామ్ గజేంద్ర సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మదీన్ సంగీతం అందించగా శ్రీనివాస్ జే రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
Sound DTS lo mogiddama!🔊#SoundParty on aha!!
Premieres March 8.@VJSunnyOfficial @Hrithika_S @sanjaysheri @polishettyravi @vjayashankarr @sivannarayana_ @MohithRahmaniac @FullmoonMediaTX @GoliSodaDigital @GKCinemaPro @adityamusic pic.twitter.com/kKyds3L670
— ahavideoin (@ahavideoIN) March 4, 2024