Sony Xperia 5 V: మార్కెట్లోకి రానున్న సోనీ ఎక్స్ పీరియా 5 వీ.. ఫీచర్లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sony Xperia 5 V: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సోనీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లను తీసుకువస్తూ తన వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా సోనీ ఎక్స్ పీరియా 5 వీ(Sony Xperia 5 V)ను ఆవిష్కరించనుంది. ఈ ఫోన్ ను సెప్టెంబర్ 1 న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ వీడియోను సెప్టెంబర్ 1 శుక్రవారం జపాన్ సమయం ప్రకారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. అయితే ఈ ఫోన్ కు సంబంధించిన ప్రోమో వీడియో నెల రోజుల క్రితమే లీక్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అది నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Also Read: Crackers Factory Blast: బెంగాల్లో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఏడుగురు మృతి
Also Read
- Supreme Court: నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
- Pujara Team: కోహ్లీ, సచిన్‌లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్... లక్ష్మణ్‌కే ఓటు..
గతేడాది సెప్టెంబర్ లో సోనీ ఎక్స్ పీరియా 5 IV ని విడుదల చేశారు. ఇప్పుడు సరిగ్గా ఏడాదికి సోనీ ఎక్స్ పీరియా 5 వీ ని కంపెనీ ఆవిష్కరించనుంది. ఇక దీనిలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాసెసర్ విషయానికి వస్తే డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తున్నట్లుగా తెలుస్తోంది. గొరిల్లా గ్లాస్ 6 డిస్ ప్లే ప్రొటెక్షన్ తో బ్యాక్ సైడ్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఇది అందుబాటులోకి రానుంది. ఇక ఇది బ్లాక్, గ్రే, బ్లూ, పింక్ కలర్లలో లభించనున్నట్లుగా తెలుస్తోంది. దీని డిస్ ప్లే 6.3 ఇన్ చ్ ఉండనుంది. 128 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉండనుంది. ఇక దీని ధర విషయానికి వస్తే రూ. ₹79,990గా ఉండవచ్చని అనుకుంటున్నారు. ఇక గతేడాది విడుదల చేసిన ఎక్స్ పీరియా IV(Sony XperiaIV) ఫోన్ ధర దాదాపు రూ.1,14,700 (1399 అమెరికా డాలర్లు) నుంచి ప్రారంభమైంది. ఈ ఫోన్ గ్రీన్, బ్లాక్ కలర్స్ లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా వుండగా యూరోపియన్ యూనియన్ మార్కెట్ లో ఎక్స్ పీరియా 10 వీ సుమారు రూ.40,300 (449 యూరోలు) లకే లభించింది. వచ్చే నెలలో విడుదలయ్యే సోనీ ఎక్స్ పీరియా 5 వీ ఏ మేరకు యూజర్ల అంచనాలు అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Supreme Court: నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్‌లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్‌కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!