Sonia Gandhi: రాజ్యసభ ఎంపీగా సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా గాంధీ.. తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. సోనియా గాంధీ ఫిబ్రవరి 15న రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు.. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ నుంచి సోనియా గాంధీతో పాటు.. బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లో 10 రాజ్యసభ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌కు 6 ఎంపీలు, బీజేపీకి 4 ఎంపీలు దక్కాయి.
Elections Schedule: మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్..!
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
2024 రాజ్యసభ ఎన్నికల కోసం రాజస్థాన్‌లో 3 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో ముగ్గురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి తేదీ. ఇతరులెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఈ ముగ్గురూ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కాగా.. గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికైన రెండో నాయకురాలు సోనియాగాంధీ. గతంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1964లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.
Kamal Nath: కమల్‌నాథ్ వ్యవహారంపై వీడిన ఉత్కంఠ! కీలక భేటీలో ఇలా!
ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో బీజేపీకి చెందిన ఎల్ మురుగన్, ఉమేష్ నాథ్ మహరాజ్, మాయా నరోలియా, బన్షీలాల్ గుర్జార్ పేర్లు ఉన్నాయి. అశోక్ సింగ్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?