Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి అనారోగ్యంతో బుధవారం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) ఏవైనా ఉన్నాయా అనే కోణంలో వైద్యులు పరీక్షలు జరిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి చేరుకున్నారని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ధృవీకరించారు.
సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారన్న వార్త తెలియగానే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన కేరళ పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. కోజికోడ్‌లో జరగాల్సిన ర్యాలీలో వర్చువల్‌గా పాల్గొంటూ.. “ఒక కొడుకుగా నా తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన చెంది ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. కేరళ ప్రజలు నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని భావోద్వేగంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో తన తల్లిని ప్రతి గంటకూ పర్యవేక్షిస్తూ తనకు ధైర్యాన్నిచ్చిన ఓ కేరళ నర్సు గురించి రాహుల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా సోనియా గాంధీ తరచూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది మార్చి 24న జ్వరం, ఇన్ఫెక్షన్ కారణంగా గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అలాగే గతేడాది జూన్ 7న, అంతకుముందు కూడా జీర్ణకోశ సంబంధిత సమస్యలతో పలుమార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. తాజాగా మరోసారి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ప్రస్తుతం సోనియా గాంధీ క్షేమంగా తిరిగి రావడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
Also Read
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
- సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
తాజావార్తలు
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!