Sonakshi Sinha: పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా ఇస్లాంలోకి మారుతుందా..? జహీర్ ఇక్బాల్ తండ్రి సంచలన ప్రకటన..
- పెళ్లి తర్వాత సోనాక్షి ఇస్లాంలోకి మారుతుందా..?
- జహీర్ ఇక్బాల్‌ని వివాహం చేసుకోనున్న సోనాక్షి..
- మతమార్పిడిపై జహీర్ తండ్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonakshi Sinha: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని ఈ నెలలో పెళ్లి చేసుకోబోతోంది. సోనాక్షి,జహీర్ ఇక్బాల్ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెళ్లికి సంబంధించిన వివరాలను సోనాక్షి తండ్రి శత్రుఘ్ను సిన్హా సన్నిహితుడు శశి రంజన్ పంచుకున్నారు. ఈ పెళ్లికి శత్రుఘ్ను సిన్హా సోదరులు అమెరికా నుంచి వస్తున్నట్లు ఆయన వెళ్లడించారు. జహీర్ ఇక్బాల్ ఇంట్లో రిజస్టర్ మ్యారేజ్ జరుగుతుందని, ఇది తమ కుటుంబాలకు సంతోషకమైన క్షణమని అన్నారు.
Read Also: Petrol price hike: గోవాలోనూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Also Read
ఇదిలా ఉంటే సోనాక్షి సిన్హా తల్లి, సోదరుడు ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరికి ఈ పెళ్లి ఇష్టం లేదనే వార్తలు వినిపించాయి. అయితే వీటిని శత్రఘ్ను సిన్హా కొట్టిపారేశారు. గతంలో ఈ వివాహానానికి శత్రఘ్ను సిన్హా కూడా హాజరుకావడం లేదని పుకార్లు వచ్చాయి. వీటిని ఖండిస్తూ, ఇది నా ఏకైక కుమార్తె సోనాక్షి వివాహమని, పెళ్లికి ఖచ్చితంగా తాను ఉంటానని చెప్పారు. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉంటే జహీర్ ఇక్బాల్‌తో పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా ఇస్లాం మతంలోకి మారుతారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జహీర్ తండ్రి ఇక్బాల్ రతాన్సీ సంచలన ప్రకటన చేశారు. పెళ్లి తర్వాత సోనాక్షి ఇస్లాంలోకి మారుతుందనే వార్తల్ని ఆయన తోసిపుచ్చారు. ఈ పెళ్లి హిందూ లేదా ఇస్లాం సంప్రదాయాన్ని కలిగి ఉండదని, ఇది సివిల్ మ్యారేజ్ అని చెప్పారు. ఆమె మతం మారడం లేదని, ఇది ఖచ్చితమని చెప్పారు. వారి హృదయాల కలయి, మతానికి ఇందులో ఎలాంటి పాత్ర లేదని చెప్పారు. నేను మానవత్వాన్ని నమ్ముతానని, దేవుడిని హిందువులు భగవాన్ అని, ముస్లింలు అల్లాని పిలుస్తారని, కానీ చివరికి మనమంతా మనుషులమని చెప్పారు. తన ఆశీస్సులు జహీర్, సోనాక్షిలకు ఉంటాయని అన్నారు. 2020 నుంచి సోనాక్షి, జహీర్ ఇద్దరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వారు 2022లో డబుల్ ఎక్స్ఎల్ సినమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!