Site icon NTV Telugu

Rajasthan : వీడు కొడుకా ఛీ..ఛీ.. తల్లిని 80సార్లు పొడిచి చంపాడు

Murder

Murder

Rajasthan : రాజస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. కనిపెంచి కంటికి రెప్పలా కాపాడుకునే కన్న తల్లిని హతమార్చాడు. 80 సార్లకు పైనే కత్తితో పొడిచి తల్లిరుణం ఇలా తీర్చుకున్నాడు. ఆమె చేసిన నేరమల్లా తన తమ్ముడి ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకకు వెళ్లుతాననడమే. ససేమీరా ఆ పెళ్లికి వెళ్లవద్దంటూ కొడుకు తల్లిని దారుణంగా వారించి అంతమొందించాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని బిల్వారా జిల్లా పుర్ పట్టణంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. నిందితుడైన ఆ యువకుడిని శుక్రవారం పట్టుకున్నారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తీసుకెళ్లారు.

Read Also: Gold Price Today: ఆభరణాల కొనుగోలుకు ఇదే సరైన సమయం.. తులం బంగారం ఎంతంటే?

పుర్ ఎస్‌హెచ్‌వో పురన్మల్ మీనా ప్రకారం, ఈ ఘటన గురువారం సాయంత్రమే చోటుచేసుకుంది. బిష్నోయి మొహల్లాలోని శంకర్ లాల్ ఇంటిలో జరిగింది. శంకర్ లాల్ మార్కెట్‌కు వెళ్లాడు. భార్య మంజు స్థానికంగా ఉంటున్న తమ్ముడి ఇంటికి వెళ్లడానికి బ్యాగ్ సర్దుతోంది. అదే సమయంలో ఆమె కొడుకు సునీల్ లోపలికి వచ్చాడు. ఎటు వెళ్లుతున్నావని తల్లిని ప్రశ్నించాడు. తన తమ్ముడి ఇంట్లో జరుగుతున్నా పెళ్లికి వెళ్తున్నానని చెప్పింది.

Read Also: Sri Hanuman Stotra Parayanam: శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇంట్లో భోగభాగ్యాలే

అంతే, వెళ్లొద్దని కొడుకు వారించడు. నా సొంత తమ్ముడు తాను కచ్చితంగా వెళ్లి తీరాల్సిందేనని తల్లి సమాధానం చెప్పింది. ఈ రకంగా వారి మధ్య మాటలు పెరిగి పెద్ద వాగ్వాదం జరిగింది. కోపంలో సునీల్ కిచెన్‌లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చాడు. తల్లిని పొడిచి చంపేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత సునీల్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు శుక్రవారం సునీల్‌ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తీసుకెళ్లినట్టు వివరించాడు. శంకర్ ఒక రైతు. సునీల్ కంప్యూటర్ కోర్సు చదివాడు కానీ, నిరుద్యోగిగానే ఉన్నాడు. మరణించిన మంజు సోదరుడు వినోద్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి చెల్లి మరణంపై ఫిర్యాదు ఇవ్వగా ఎఫ్ఐఆర్ నమోదైంది.

Exit mobile version