బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. పెళ్లిళ్లకు ముందే బంగారు, వెండి ఆభరణాలను తక్కువ ధరలకు కొనుగోలు చేసేందుకు ఇదే సరైన అవకాశం. భారతదేశంలో 24 క్యారెట్లు క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గింది. 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.220 తగ్గింది. ఏప్రిల్ 29 (శనివారం) నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 60,170 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 55,110గా కొనసాగుతోంది.
Also Read:Cruise Ships: ప్రపంచంలో 10 అతిపెద్ద క్రూజ్ షిప్స్
భారతదేశంలోని ప్రధాన నగరాలు కూడా బంగారం ధరలలో మార్పులను నమోదు చేశాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,820గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,970 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 55,900. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,820 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) రూ. 55,750. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,820 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.55,750గా ఉంది. భువనేశ్వర్‌లో మాదిరిగానే ఈరోజు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.60,820, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.55,750గా నమోదైంది.