Tragedy: పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురిలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. అంబులెన్స్ డ్రైవర్ అధిక డబ్బులు డిమాండ్ చేయడంతో తన తల్లి మృతదేహాన్ని భుజాలపై మోయవలసి వచ్చింది. దాదాపు 50 కిలోమీటర్ల పాటు తన తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లాగు. వాస్తవానికి, అంబులెన్స్ డ్రైవర్ నిర్ణీత రుసుం కంటే దాదాపు మూడు రెట్లు డిమాండ్ చేశాడు.
Read Also : Prince Harry : మా అన్న నన్ను పడేసి తన్నాడు.. అందుకే నడుం నొప్పి వచ్చింది
జల్పాయిగురి జిల్లా కేకే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఓ మహిళ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కన్నుమూసింది. తల్లిని పోగొట్టుకున్న బాధలో ఉన్న కొడుకు మృతదేహాన్ని పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్ ను ఆశ్రయించాడు. కానీ, అతడు నిర్ణీత రుసుం రూ.900కు బదులు రూ.3వేలకు పైగా అడిగాడు. అది చెల్లించలేని కొడుకు తన తండ్రితో కలిసి ఆమె మృతదేహాన్ని భుజాలపై ఎత్తుకుని గ్రామానికి కాలినడకన బయలుదేరారు. దాదాపు 50 కిలోమీటర్లు నడిచాడు. మరణించిన మహిళ కుమారుడు జై కృష్ణ దివాన్ మాట్లాడుతూ, “నేను మా అమ్మను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు, అంబులెన్స్ డ్రైవర్ రూ. 900 తీసుకున్నాడు. అయితే, మృతదేహాన్ని తీసుకెళ్లడానికి మాత్రం రూ. 3000 డిమాండ్ చేశాడు. ఇంకొంచెం డబ్బులు తీసుకోమని చెప్పాను కానీ వాడు ఒప్పుకోలేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
The Pope Emeritus Benedict XVI : పోప్ బెనడిక్ట్‌కు తుది వీడ్కోలు
ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్, హాస్పిటల్ టై-అప్ అయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా దేశంలో చాలా చోట్ల ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పరిపాలన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఒడిశా నుంచి కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఆగస్టులో, మాఝీ అనే వ్యక్తి తన చనిపోయిన భార్య మృతదేహాన్ని తన భుజాలపై అనేక కిలోమీటర్లు మోసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అతని చిన్న కుమార్తె కూడా అతనితో ఉంది. ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. చనిపోయిన కుమారుడిని ఆసుపత్రి నుండి 90 కిలోమీటర్ల దూరంలోని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ డ్రైవర్ రూ.20,000 డిమాండ్ చేశాడు. తండ్రి బస్ వెనుక సీట్లో కూర్చుని కుమారుడి మృతదేహాన్ని తరలించాడు.