మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో కన్నతల్లిపై కత్తితో దాడి చేశాడు కసాయి కొడుకు. స్థానికులు వెంటనే తల్లి రజినినీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లికి వేరొకరితో అక్రమ సంబంధం ఉందని పక్కాగా ప్లాన్ వేసిన కొడుకు.. సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఇంటికి పిలిచి మందు తాగించాడు రజిని కొడుకు. తాగిన తర్వాత గొడవ చేసి అతన్ని చంపే ప్రయత్నం చేశాడు. తల్లి అడ్డు రావడంతో తల్లి పై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో తల్లి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కొడుకుతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు.